అది భరించలేక.. భర్త గొంతుమీద కాలితో తొక్కి హతమార్చింది..

Published : Apr 13, 2021, 02:25 PM IST
అది భరించలేక.. భర్త గొంతుమీద కాలితో తొక్కి హతమార్చింది..

సారాంశం

మద్యానికి బానిసై తరచూ వేధిస్తున్న ఓ భర్తమీద విసిగిపోయిన భార్య అతని గొంతుమీద కాలితో తొక్కి హతమార్చింది. ఈ సంఘటన బెంగళూరులో కలకలం రేపింది. బెంగళూరు జగజ్జీవన్ రామ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఈ దారుణ ఘటన జరిగింది. 

మద్యానికి బానిసై తరచూ వేధిస్తున్న ఓ భర్తమీద విసిగిపోయిన భార్య అతని గొంతుమీద కాలితో తొక్కి హతమార్చింది. ఈ సంఘటన బెంగళూరులో కలకలం రేపింది. బెంగళూరు జగజ్జీవన్ రామ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఈ దారుణ ఘటన జరిగింది. 

హతుడు బీబీఎంపీ చెత్త రవాణా చేసే ఆటో డ్రైవర్ మోహన్ (41) హత్యకు గురయ్యాడు. అతని భార్య (36) అతన్ని హతమార్చింది. పోలీసులు పద్మను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. పద్మ కూడా బీబీఎంపీలోనే కాంట్రాక్టు పౌర కార్మికురాలిగా పనిచేస్తోంది.

వివరాల్లోకి వెడితే... మోహన్, పద్మలకు 16 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. వీరికి ముగ్గురు పిల్లలు. మోహన్ కు తాగుడు అలవాటు ఉంది. విపరీతంగ తాగుతాడు. ఈ విషయంలో ఇద్దరికీ తరచుగా గొడవలు జరిగేవి. మోహన్ తో మందు అలవాటు మాన్పించాలని ఆరెనెలల క్రితం రిహాబిలిటేషన్ సెంటర్ కు కూడా పంపారు.

అక్కడినుంచి వచ్చిన కొద్ది కాలం మద్యానికి దూరంగా ఉన్న మోహన్ ఇటీవల మళ్లీ తాగుడుకు బానిసయ్యాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి వచ్చిన మోహన్ మరోసారి తాగడానికి డబ్బులు కావాలంటూ భార్యను డిమాండ్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

తెల్లవారుజామున 3.15 గం.ల వేళ మరోసారి భర్యభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పద్మ, మోహన్ ను తోసేసింది. కిందపడ్డ మోహన్  గొంతుమీద కాలు వేసి గట్టిగా తొక్కడంతో అతను అస్వస్థకు గురయ్యాడు.

ఇది గమనించిన స్థానికంగా ఉండే వారి బంధువులు హుటాహుటిన కెంపేగౌడ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సలు ఫలించక మోహన్ మృతి చెందాడు. జగజ్జీవన్‌రామ్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతికి కారణమైన భార్య పద్మను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కాగా గొడవ జరిగినప్పుడు ముగ్గురు పిల్లలు ఇంట్లో లేనట్లుగా తెలిసింది. 
 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?