పీటీసార్ నిర్వాకం : విద్యార్థినిని ఎత్తుకుపోయి పెళ్లిచేసుకుందామనుకున్నాడు.. కానీ..

Published : Apr 13, 2021, 12:41 PM IST
పీటీసార్ నిర్వాకం : విద్యార్థినిని ఎత్తుకుపోయి పెళ్లిచేసుకుందామనుకున్నాడు.. కానీ..

సారాంశం

అమ్మాయిల మీద అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆడపిల్ల కనిపిస్తే చాలు రకరకాలుగా వేధించడం, హింసించడం, ఇబ్బందులు పెట్టడం కామన్ అయిపోతోంది. తాజాగా స్కూల్ టీచర్ విద్యార్థిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించిన దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. 

కృష్ణగిరి జిల్లా మత్తూరు సమీపంలో ప్లస్ వన్ చదువుతున్న విద్యార్థినిని కిడ్నాప్ చేసి వివాహం చేసుకోవడానికి ప్రయత్నించిన ప్రభుత్వ వ్యాయామోపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కృష్ణగిరి జిల్లా మత్తూరు సమీపంలో జింజెమ్ పట్టికి చెందిన మూర్తి కుమార్తె (16) ప్లస్ వన్ చదువుతోంది. తిరువణ్ణామలై జిల్లా మేల్ సంగంలో ఉంటోంది. అక్కడ కూలి పనులు చేస్తూ అదే ప్రాంతంలో ఉన్న డేనియల్ మిషన్ మెట్రిక్యులేషన్ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తోంది. 

కరోనా: ఆస్పత్రిలో గుట్టలుగా శవాలు.. కుప్పగా అంత్యక్రియలు...

ఈ నేపథ్యంలో 9వ తేదీన ఆ విద్యార్థిని అదృశ్యమైంది. దీనిమీద విద్యార్థిని తల్లి కావ్య ఫిర్యాదు చేయడంతో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పీటీ మాస్టర్ గా పని చేస్తున్న చరణ్ రాజ్ వివాహం చేసుకోవడానికి ఆ విద్యార్థినిని కిడ్నాప్ చేసినట్లు తేలింది.

దీంతో మత్తూరు పోలీస్ ఇన స్పెక్టర్ మురుగన్ ఆదివారం చరణ్ రాజ్ ను అరెస్ట్ చేశారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?