Air India Plane Crash: భార్య చివరి కోరిక తీర్చేందుకు వచ్చి..తాను అనంతలోకాలకు చేరిన అర్జున్‌!

Published : Jun 13, 2025, 01:00 PM IST
Air India Plane Crash: భార్య చివరి కోరిక తీర్చేందుకు వచ్చి..తాను అనంతలోకాలకు చేరిన అర్జున్‌!

సారాంశం

విమాన ప్రమాదంలో మరణించిన అర్జున్ పట్టోలియా, తన భార్య చివరి కోరిక తీర్చేందుకు ఇండియా వచ్చాడు. ఇంతలోనే ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి ఇద్దరు ఆడపిల్లలు అనాథలయ్యారు.

242 మందితో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కూలిపోయి 241 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎంతో మంది ఎన్నో కలలతో విమానం ఎక్కారు.ఒకరు మరిది వివాహం కోసం వచ్చి తిరిగి వెళ్లేందుకు విమానం ఎక్కగా.. కొడుకుని కలిసేందుకు లండన్ వెళ్తున్న తల్లిదండ్రులు,ముగ్గురు చిన్నపిల్లలతో వెళ్తున్న డాక్టర్ కుటుంబం,త్వరలో ఉద్యోగం మానేసి వస్తాను నాన్న అని చెప్పిన పైలట్ కొడుకు..అక్కా..మీతో మాట్లాడాటానికి నాకు కుదురదు అని చెప్పిన ఎయిర్ హోస్టస్ చెల్లి…ఇలా ఎంతో మంది ఈ ప్రమాదం లో చనిపోయారు.

వారిలో వారం రోజుల క్రితం చనిపోయిన భార్య చివరి కోరికను తీర్చేందుకు లండన్ నుంచి స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్తున్న అర్జున్ పట్టోలియా కథ కూడా  ఒకటి. అర్జున్ ఫ్యామిలీ చాలా సంవత్సరాల క్రితమే లండన్ లో స్థిరపడిపోయారు. వారం క్రితం అతని భార్య భారతి బెన్ అనారోగ్యంతో చనిపోయింది. వీరికి 8,4 సంవత్సరాల ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారిని కన్నవారి దగ్గర వదిలి భార్య చివరి కోరిక మేరకు ఆమె చితభస్మాన్ని స్వగ్రామంలోని నదిలో కలిపేందుకు భారత్ కి వచ్చారు.

ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని బిడ్డల దగ్గరకు ఎంతో ఆశగా బయల్దేరిన అర్జున్ ఆశన్ని ఆవిరి అయిపోయాయి.ఎయిర్ ిండియా ప్రమాదం అర్జున్ ని కూడా అతని భార్య వద్దకే చేర్చింది. ఈ విషయం తెలుసుకున్న అర్జున్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వయసు మీదపడిన అర్జున్ తల్లిదండ్రులు తరువాత ఆ ఆడపిల్లలను ఎవరూ చూస్తారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం 600 అడుగుల ఎత్తుకు వెళ్లగానే మధ్యాహ్నం 1.40 గంటలకు బిజె మెడికల్ కాలేజీ పురుషుల వసతి గృహంపై కూలిపోయింది. విమానంలో 232 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లు ఉన్నారు. 53 మంది బ్రిటీష్ పౌరులు కూడా ఉన్నారు. బ్రిటీష్ పౌరుడైన భారతీయ సంతతికి చెందిన 40 ఏళ్ల విశ్వాస్ కుమార్ రమేష్ మాత్రమే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?
Hubballi : వధూవరులు లేకుండానే రిసెప్షన్ !