
ముంబై : ఎనిమిదేళ్ల కూతురిమీద అత్యాచారానికి పాల్పడ్డ ఓ వ్యక్తికి ముంబైకోర్టు జీవితఖైదు విధించింది. తండ్రి అయి ఉండి ఇలాంటి చర్యకు పాల్పడడం అత్యంత హేయం అంటూ.. దీనికి జీవితఖైదే సరిపోయే చర్య అని కోర్టు పేర్కొంది.
"దాదాపు ప్రతి సంస్కృతిలో, కుటుంబంలో తండ్రికి ప్రధాన రక్షకుడు, బాగోగులు చూసేకునేవాడు, క్రమశిక్షణ నేర్పేవాడులాంటి పాత్ర ఉంటుంది. అమ్మాయి యుక్తవయస్సుకు రావడంలో తండ్రి-కూతురుల సంబంధం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కేసులో బాధితురాలు కేవలం 8 సంవత్సరాల వయస్సు గల బాలిక. నిందితుడు తండ్రి, ఇది 'ప్రొటెక్టర్ టర్నింగ్ ప్రెడేటర్' అనే స్పష్టమైన కేసు. అందువల్ల, నిందితులు చేసిన చర్య దారుణమైనది, అరుదైనది, కాబట్టి ఈ కేసులో నిందితుడికి జీవితఖైదే సమంజసమైనది" అని ప్రత్యేక న్యాయమూర్తి నజీరా ఎస్ షేక్ అన్నారు.
ఢిల్లీని వీడని వరద.. ఉధృతంగానే యమునా ప్రవాహం.. వర్షసూచనతో జనాల్లో ఆందోళ..!
నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తల్లి మొదట పోలీసులకు చెప్పగా, కోర్టులో ఆమె కుమార్తె, ఆమె ఇద్దరూ వారి వాంగ్మూలాన్ని విరమించుకున్నారు. భర్త/తండ్రి జైలుకు వెడితే తమ జీవనం కష్టంగా మారుతుందని.. అత్యంత దీనస్థితికి పడిపోతామని, ఇంటి అద్దె కూడా చెల్లించలేమని తెలిపారు.
బాధిత చిన్నారి ప్రైవేట్ భాగాలకు గాయాలు అయ్యాయని.. ఆ గాయాల రక్తం, నిందితుడి బట్టలపై ఉన్న రక్తం సరిపోలుతుందని డాక్టర్లిచ్చిన రిపోర్టును న్యాయమూర్తి పరిగణలోకి తీసుకున్నారు. బాధితులు తమ వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవడానికి... "కుటుంబ ఒత్తిడి, సామాజిక కళంకం, తరువాత సమాజంలో ఎలా బతకాలన్న దానివల్ల కలిగే భయం..వల్ల వారు ఈ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు’ అని న్యాయవాది అన్నారు.
అయినప్పటికీ, సాక్ష్యం వైద్యులు ఇచ్చిన రిపోర్టు రూపంలో ఫిర్యాదును ధృవీకరించడం వల్ల.. బాధితురాలిపై లైంగిక వేధింపులకు నిందితుడు పాల్పడినట్లు రుజువు చేస్తుంది" అని ప్రత్యేక న్యాయమూర్తి అన్నారు. 20 పేజీల తీర్పు కాపీలో, సాధారణంగా దుండగుడికి దగ్గరి సంబంధం ఉన్నట్లయితే, అతనిపై నిలదీయకుండా పార్టీలు తమను తాము నిగ్రహించుకుంటారని న్యాయమూర్తి అన్నారు.
"ఈ కేసులో, నిందితుడు ఆ కుటుంబానికి ఏకైక ఆధారం. దీనివల్లే.. నిందితుడిని విడుదల చేసి తీసుకెళ్లాలని ఆమె కోరుకుంటున్నట్లుగా... క్రాస్ ఎగ్జామినేషన్‌లో అంగీకరించింది. దీంతో బాధితురాలైన చిన్నారిని, ఆమె తల్లిని జాగ్రత్తగా చూసుకోండి" అని న్యాయమూర్తి అన్నారు.
డీఎన్‌ఏ విశ్లేషణలో బాధితురాలి లోదుస్తులు, ఫ్రాక్‌పై రక్తం కనిపించిందని, నిందితుడి ప్యాంట్ మీది రక్తం సరిపోలిందని జడ్జి సూచించారు. "మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్, ఫోరెన్సిక్ సాక్ష్యాలు ప్రాసిక్యూషన్ కేసును ఎటువంటి సందేహం లేకుండా పూర్తిగా నిర్ధారిస్తాయి" అని న్యాయమూర్తి చెప్పారు.
అక్టోబరు 12, 2020న, ఘటన జరిగిన రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆ చిన్నారి తల్లి.. ఆమె తల్లి ఇంటికి వెళ్లిందని ప్రాసిక్యూషన్ కేసులో ఉంది. బాధితురాలు తన ఇతర పిల్లలతో కలిసి నిందితుడితో కలిసి ఒకే ఇంట్లో ఉంది. ఆమె తన తల్లి ఇంటినుంచి సాయంత్రం 6 గంటల సమయంలో వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోకి రాగానే బాధితురాలి అరుపులు వినిపించాయి. తన భర్త, నిందితుడు అర్ధనగ్నంగా ఉండి బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడడం ఆమె చూసింది. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించింది.
(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితురాలి గుర్తింపు ఆమె గోప్యతను కాపాడేందుకు బహిర్గతం చేయబడలేదు)