పెళ్లి చేసి ఆరు నెలలు కాలేదు.. కొడుకు, కోడలిని హతమార్చిన తండ్రి.. కారణమిదే!

Published : May 20, 2022, 05:36 PM IST
పెళ్లి చేసి ఆరు నెలలు కాలేదు.. కొడుకు, కోడలిని హతమార్చిన తండ్రి.. కారణమిదే!

సారాంశం

పెళ్లి చేసి ఆరు నెలలు కూడా కాలేదు. కానీ ఆర్థిక సమస్యలు తనను చుట్టుముట్టాయని, ఇల్లు గడవడం మరింత కష్టమైందని టీ స్టాల్ నడిపే ఆ తండ్రి కొడుకు, కోడలిని కత్తితో గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత తన చిన్న కుమారుడిని చంపేసి, తానూ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు పోలీసులకు తెలిపాడు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.  

న్యూఢిల్లీ: పెళ్లి చేసుకుని ఆరు నెలలు నిండలేదు. కానీ, ఆ దంపతులిద్దరూ రక్తపు మడుగులో కనిపించారు. దారుణ హత్యకు గురయ్యారు. హంతకుడూ ఏ పగవాడో కాదు.. ఇంటి వాడే. కన్నతండ్రే కొడుకును, కోడలిని కసాయివాడిలా గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

కాన్పూర్‌లో రామ్ బాగ్ ఏరియాకు చెందిన దీప్ కుమార్‌కు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకుకు కొన్ని నెలల క్రితం సీఎం జరిపించిన సామూహిక వివాహాల్లోనే పెళ్లి జరిపించాడు. స్వరూప్ నగర్‌లో ఓ హాస్పిటల్ బయట టీ స్టాల్ నడుపుతున్నాడు. పెద్ద కొడుక్కు పెళ్లి అయితే జరిపించాడు. కానీ, అప్పులతోపాటు ఇల్లు గడవడం కష్టంగా మారింది. కొన్ని రోజుల నుంచి దీప్ కుమార్ ఆర్థిక సమస్యలపై తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎలా ముందుకు సాగేది అర్థం కాలేదు. ఇక జీవించడం సాధ్యం కాదనే నిరాశలోకి కూరుకుపోయాడు. ఆర్థిక సమస్యల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇందులో నుంచే ఓ క్రూర నిర్ణయానికి వచ్చాడు. తన కుటుంబాన్ని మొత్తం అంతం చేసి తానూ ఆత్మహత్య చేసుకుని మరణించాలని అనుకున్నాడు.

ఓ రోజు తన కొడుకు, కోడలు నిద్రిస్తున్న సమయంలో పదునైన కత్తి తీసుకుని గదిలోకి వెళ్లాడు. ముందు తన కొడుకును చంపేయాలని నిర్ణయించుకున్నాడు.  కత్తితో తన కొడుకు గొంతు కోశాడు. ఈ చప్పుడు విని కోడులు నిద్ర లేచింది. వెంటనే అరిచింది. కానీ, దీప్ కుమార్ అదే కత్తితో తన కోడలు గొంతునూ కోసేశాడు. వారిద్దరూ రక్తపు మడుగులో పడిపోయి మరణించారని పోలీసులకు దర్యాప్తులో దీప్ కుమార్ తెలిపాడు. ఈ మేరకు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు వెల్లడించారు.

అయితే, ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని అడగ్గా.. తన ఆర్థిక సమస్యలే అని దీప్ కుమార్ వెల్లడించారని పోలీసులు తెలిపారు. తన కొడుకు, కోడలినే కాదు.. ఆ తర్వాత తన చిన్న కుమారుడిని కూడా చంపేయాలని భావించినట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ చేసినట్టు వివరించారు.

రెండు హత్యలు చేసిన దీప్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యలకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu