ఆస్తి కోసం తండ్రి, కొడుకులను చంపేసి..

Published : Jan 09, 2021, 08:28 AM ISTUpdated : Jan 09, 2021, 08:39 AM IST
ఆస్తి కోసం తండ్రి, కొడుకులను చంపేసి..

సారాంశం

ఆస్తి వివాదాల వల్లనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆ దిశగా కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఆస్తి కోసం ఓ తండ్రి, కొడుకులను అతి దారుణంగా హత్య చేశారు. వారం రోజుల క్రితం తండ్రిని చంపేసి.. ఆ తర్వాత కొడుకును కూడా చంపేశారు. ఈ విషాద ఘటన మైసురులోని విద్యారణ్యపుర పోలీస్‌ స్టేషన్‌పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.  

పూర్తి వివరాల్లోకి వెళితే.. మైసూరు తాలూకా, మండకళ్లికి చెందిన మరిగౌడ(48) ఈనెల 2న మైసూరు నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా మార్గం మధ్యలో దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన మరువక ముందే అతని కుమారుడు సతీష్‌  శుక్రవారం మైసూరుకు బైక్‌పై వెళ్తుండగా దుండగులు అడ్డుకొని హత్య చేసి ఉడాయించారు.  

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఆస్తి వివాదాల వల్లనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆ దిశగా కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.  కాగా.. వారం వ్యవధిలో తండ్రి, కొడుకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల వారి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. కాగా.. ఈ ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు