కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి

By team teluguFirst Published Dec 11, 2022, 3:02 PM IST
Highlights

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు సరదాగా వీకెండ్ ఎంజాయ్ చేద్దామని కారులో శివమొగ్గకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఓ లారీని ఢీకొట్టింది. ఈ ఘనటలో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. 

కర్ణాటకలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివమొగ్గ జిల్లా సవలంగ రోడ్డులోని కల్లాపుర సమీపంలో ఓ కారు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో విద్యార్థికి గాయాలు అయ్యాయి. వీరందరి వయస్సు 20-21 ఏళ్ల మధ్యనే ఉంటాయి.

హిమాచల్ ప్రదేశ్ నూతన సీఎంగా సుఖ్వీందర్ సింగ్ ప్రమాణ స్వీకారం.. హాజరైన ఖర్గే, రాహుల్, ప్రియాంక..

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉంటాయి. దావణగెరె ప్రాంతానికి చెందిన  కార్తీక్, వివేక్, మోహన్‌, రుద్రేష్‌ అనే నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు శనివారం రాత్రి కారులో శివమొగ్గ పర్యటనకు వచ్చారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు దావణగెరెకు తిరిగి వస్తున్నారు. కారు కల్లాపుర ప్రాంతానికి చేరుకునే సరికి మరో వాహానాన్ని ఓవర్ టేక్ చేయాలని అనుకున్నారు. అయితే ఇదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. 

ఈ ఘటనలో కార్తీక్, వివేక్, మోహన్‌గా అక్కడికక్కడే మరణించారు. రుద్రేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై శివమొగ్గ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నాకు పదవులు ముఖ్యం కాదు: పీసీసీ కమిటీల్లో చోటు దక్కకపోవడంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఇదే రాష్ట్రంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని అనంతపురంకు చెందిన దంపతులు, ఓ చిన్నారి చనిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతరం జిల్లా ఉరవకొండ మండలం చిన్న ముష్టూరుకు చెందిన రిటైర్డ్ విద్యుత్ ఉద్యోగి శ్రీరాములు కొడుకు శ్రీకాంత్ (41), కోడలు ప్రతీక్ష(35) సాప్ట్ వేర్ ఇంజనీర్లు. వీరికి గమ్య(4), దైవిక్(2) సంతానం. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ సాప్ట్ వేర్ కంపెనీలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వీకెండ్ కావడంతో కావడంతో శ్రీకాంత్, ప్రతీక్ష దంపతులు సరదాగా బయటకు వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు. కొడుకు దైవిక్(2) ను గ్రామంలోని తల్లిదండ్రుల వద్ద వుంచి కూతురు, భార్యతో కలిసి శ్రీకాంత్ కర్ణాటకలో ఆద్యాత్మిక ప్రాంతాలను సందర్శనకు కారులో బయలుదేరాడు. 

మహారాష్ట్ర మంత్రి ముఖంపై ఇంక్ దాడి.. అంబేద్కర్, ఫూలేలపై కామెంట్లతో ఆగ్రహం!(వీడియో)

శుక్రవారం రాత్రి బెంగళూరు నుండి బయలుదేరిన వీరు శనివారం ధర్మస్థలికి చేరుకుని మంజునాథస్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుండి శృంగేరికి బయలుదేరారు అయితే వీరు ఉడిపి జిల్లాలో ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కారును ఢీకొట్టింది. రెండు వాహనాలు చాలావేగంతో ఎదురెదురుగా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. దీంతో శ్రీకాంత్, ప్రతీక్ష దంపతులతో పాటు చిన్నారి గమ్య కూడా అక్కడికక్కడే మృతిచెందారు.  వెంటనే ప్రమాదస్థలికి చేరుకున్న స్థానిక పోలీసులు మృతుల వివరాలు తెలుసుకుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. 

click me!