ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. ముగ్గురు మృతి, 15 మందికి గాయాలు

Published : Nov 07, 2023, 11:07 AM IST
 ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. ముగ్గురు మృతి, 15 మందికి గాయాలు

సారాంశం

ఓ బస్సు లోయలో పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మరణించారు. మరో 15 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో చోటు చేసుకుంది. క్షతగాత్రులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 

జమ్మూకాశ్మీర్ లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజౌరీ జిల్లా కొత్రాంక ప్రాంతంలో ఓ మినీ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. దీనిపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. 

వివరాలు ఇలా ఉన్నాయి. 18 మంది ప్రయాణికులతో కూడిన మినీ బస్సు  పకౌరీ నుంచి రాజౌరీ సోమవారం వెళ్తోంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో పర్వత ప్రాంతంలోని ఫర్వాలా నగ్రోటాకి చేరుకుంది. అక్కడ ప్రమాదకరమైన మూల మలుపు ఉండటంతో ఒక్క సారిగా డ్రైవర్ కంట్రోల్ కోల్పోయాడు. దీంతో ఆ బస్సు 300 అడుగుల లోయలో పడిపోయింది. 

ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజౌరీ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. మొత్తం 18 మందిని ఆసుపత్రికి తీసుకువచ్చామని, వారిలో ముగ్గురు జీఎంసీ రాజౌరీ అనుబంధ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ విభాగంలో మరణించినట్లు ప్రకటించారని మెడికల్ సూపరింటెండెంట్ మహమూద్ హుస్సేన్ పేర్కొన్నారు. క్షతగాత్రులు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. 

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులను హుబ్ కందికి చెందిన అబ్దుల్ రషీద్, తుల్లికి చెందిన మహ్మద్ హనీఫ్, ద్రాజ్ బుదల్ కు చెందిన మహ్మద్ ఆజంగా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన మృ*తదేహాలను హెలికాఫ్టర్లతో | Rescue Operation Latest Visuals From Nepal
Abhinandan Varthaman: పాక్ ఎఫ్‌16ను కూల్చిన హీరో అభినందన్ వర్ధమాన్ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో ఎందుకు చేరారు?