నటి సంజనకు అశ్లీల సందేశాలు.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కొడుకు అరెస్ట్...

Published : Mar 05, 2022, 08:17 AM IST
నటి సంజనకు అశ్లీల సందేశాలు.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కొడుకు అరెస్ట్...

సారాంశం

కన్నడ నటి సంజనా గల్రానీకి అశ్లీల సందేశాలు పంపిన కేసులో ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్,  కొరియోగ్రాఫర్ ప్రసాద్ బిడపా కుమారుడు ఆదమ్ బిడపాను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

యశవంతపుర : నటి Sanjana Galraniకి అశ్లీల సందేశాలు పంపిన ఓ fashion designer కుమారుడిని ఇందిరానగర పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఫిబ్రవరి 25 అర్థరాత్రి నటి సంజనాకు obscene message పంపాడు. దీంతో సంజనా వాట్సాప్ చాట్ సందేశాలను పోలీసులకు అందజేయడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తాను సంజనకు ఎలాంటి సందేశాలను పంపలేదని పోలీసులకు వివరించినట్లు సమాచారం. 

ఇదిలా ఉండగా, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన హీరోయిన్ సంజనా గల్రాని. వివాదాలు చుట్టు తిరిగే ఈ స్టార్.. రీసెంట్ గా డ్రగ్స్ కేసులో నానా అవస్థలు పడి... అరెస్ట్ అయ్యి బెయిల్ మీద తిరిగి వచ్చింది. వచ్చీ రావడంతోనే తన చిరకాల మిత్రుడు డాక్టర్ పాషాను పెళ్లి చేసుకుంది సంజన. రీసెంట్ గా కూడా కొన్ని వివాదాలు ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి. 

సోషల్ మీడియాలో సంజనను బాగా తిట్టిపోస్తున్నారు. చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. కన్నడ నాట స్టార్ హీరోయిన్ గా ఉన్న సంజన గల్రాని లాస్ట్ ఇయర్ రహస్యంగా  డాక్టర్ అజిజ్ పాషాను పెళ్ళి చేసుకున్నారు. ఆమె లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తున్నారు అనుకున్న టైమ్ లో మరోసారి డ్రగ్స్ ఇష్యూ తెరపైకి రావడం.. సజనాను బాగా డిస్ట్రబ్ చేశాయి. 

ఇక ఈమధ్య సంజనా ఫ్యామిలీ లైఫ్ బాగా లేదని.. ఈమె విడాకులు తీసుకోబోతుందంటూ.. న్యూస్ వైరల్ అయ్యింది. కన్నడ నాట ఈ వార్తం ఫాస్ట్ గా వ్యాపించింది. సోషల్ మీడియాలో హాల్ చల్ చేసిందీ న్యూస్.రీసెంట్ గా ఆమె డివోర్స్ తీసుకుంటున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంలో కూడా ఆమె ఘాటుగానే స్పందించింది. తాము బాగానే ఉన్నామని.. అన్యోన్యంగా ఉన్నామని.. తన మీద పిచ్చి పిచ్చి వార్తలు ప్రచారం చెయ్యోద్దని అంటూ ట్రోలర్స్ పై మండిపడింది బ్యూటీ.

ఇక ఇప్పుడు మరో షాకింగ్ అనౌన్స్ మెంట్ చేసింది సంజన మాతృత్వం అనేది ఓ మధుర అనుభవం తాను ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని.. ఆ అనుభూతిని ఇప్పుడు తాను పొందుతున్నట్టు చెప్పింది సంజన. తాను 5 నెలల గర్భంతో ఉన్నానని ప్రకటించింది. ఈ ప్రకటన ద్వారా భర్తతో  విడిపోవడం లేదని గట్టిగా చెప్పే ప్రయత్నం చేసింద సంజన. అంతే కాదు అందరి ప్రెగ్నెంట్ అంటే రెస్ట్ తీసుకోవడానికి చూస్తారు. కాని తాను అలా కాదని అంటోంది. డెలివరీకి రెండు వారాల ముందువరకూ పనిచేసేవారు చాలామంది ఉన్నారు. తానుకూడా అలానే అంటోంది సంజన. 

కన్నడతో పాటు తెలుగు సినిమాల్లో కూడా చేసింది సంజన. ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడు సినిమాతో టాలీవుడ్ లో ఆమె అందరికి గుర్తుండిపోయింది. ఈసినిమా తరువాత పెద్దగా చెప్పుకోదగ్గ ఆఫర్లు ఏమీ రాలేదు సంజనకు. డ్రగ్స్ కేసులో ఇరుక్కుని ఇబ్బందులు పడ్డ సంజన..మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకవెవ్వరూ సినిమాకు వెళ్తూ.. బెంగళూరులో మాస్క్ పెట్టుకోకుండా ట్రోల్స్ కు గురైయింది. అంతకు ముందు క్యాబ్ డ్రైవర్ తనను ఇబ్బంది పెట్టాడంటూ.. కేసు పెట్టి తానే చిక్కుల్లో పడింది సంజన.

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!