లక్ష ట్రాక్టర్లతో ర్యాలీ జరిపి తీరుతాం: తేల్చిచెప్పిన రైతు సంఘాలు

By Siva KodatiFirst Published Jan 17, 2021, 7:26 PM IST
Highlights

రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ చేపట్టి తీరుతామన్నారు రైతు సంఘాల నేతలు. ఔటర్ రింగ్ రోడ్‌లో లక్ష ట్రాక్టర్లతో మార్చ్ చేపడతామని వారు తేల్చి చెప్పారు. అయితే తమ వల్ల రిపబ్లిక్ డే వేడుకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు

రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ చేపట్టి తీరుతామన్నారు రైతు సంఘాల నేతలు. ఔటర్ రింగ్ రోడ్‌లో లక్ష ట్రాక్టర్లతో మార్చ్ చేపడతామని వారు తేల్చి చెప్పారు. అయితే తమ వల్ల రిపబ్లిక్ డే వేడుకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు.

రెండు నెలల నుంచి శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్నామని.. ట్రాక్టర్ ర్యాలీ కూడా శాంతియుతంగానే చేపడతామన్నారు. మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న ట్రాక్టర్ ర్యాలీని సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

ట్రాక్టర్ మార్చ్‌తో రిపబ్లిక్ డే వేడుకలకు ఇబ్బంది కలుగుతుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. దీనిపై రేపు సుప్రీంకోర్ట్ విచారణ చేపట్టనుంది. సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ విచారణ జరపనుంది.  మరోవైపు ఎల్లుండి కేంద్రం, రైతుల మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి.

శుక్రవారం జరిగిన 9వ విడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దీంతో 19న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. వ్యవసాయ చట్టాలపై క్లాజుల వారీగా చర్చలకు రావవాలని రైతు సంఘాలను కోరారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. 
 

click me!