మద్యం అక్రమ రవాణా: రోజూ రూ. 9 లక్షలు సంపాదిస్తున్న ఏంబీఏ స్టూడెంట్

By narsimha lodeFirst Published Jan 17, 2021, 5:13 PM IST
Highlights

ఎంబీఏ విద్యార్ధి మద్యం విక్రయిస్తూ రోజుకు రూ.9 లక్షలను సంపాదిస్తున్నాడు. మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

పాట్నా:ఎంబీఏ విద్యార్ధి మద్యం విక్రయిస్తూ రోజుకు రూ.9 లక్షలను సంపాదిస్తున్నాడు. మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకొంది.బీహార్ లో మద్య నిషేధం అమల్లో ఉన్నప్పటికీ కూడ  రాష్ట్రంలో మద్యం దొరుకుతోంది. అధికారుల కంటపడకుండా కొందరు అక్రమార్కులు మద్యాన్ని విక్రయిస్తున్నారు. 

డబ్బు సంపాదన కోసం ఓ ఏంబీఏ విద్యార్ధి అక్రమంగా మద్యం విక్రయిస్తున్నాడు.  అక్రమంగా మద్యం విక్రయిస్తూ  ఏంబీఏ విద్యార్ధి పట్టుబడ్డాడు.పాట్నాకు చెందిన అతుల్ సింగ్ ప్రైవేట్ యూనివర్శిటీలో ఏంబీఏ చదువుతున్నాడు. పౌల్ట్రీ పరిశ్రమలో నష్టపోయిన అతుల్ సింగ్ సులువుగా డబ్బులు సంపాదించేకు అక్రమంగా మద్యం విక్రయించడాన్ని మార్గంగా ఎంచుకొన్నాడు.

అక్రమంగా మద్యం విక్రయించడం ద్వారా అతుల్ సింగ్ భారీగా డబ్బులు సంపాదించాడు. ఈ డబ్బుతో ఆయన విలాసవంతంగా గడిపేవాడు.శుక్రవారం నాడు నిందితుడు నివాసం ఉంటున్న  ఇంట్లో మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. సుమారు రూ. 21 లక్షల విలువైన 1100 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు.

అతుల్ సింగ్ ఉపయోగించిన డైరీలో ఎక్కడెక్కడ ఎవరెవరికీ మద్యం విక్రయించాడో పోలీసులు ఆరా తీస్తున్నారు. మద్యం అక్రమ రవాణా కోసం కొంతమంది ఏజంట్లను కూడ ఏర్పాటు చేసుకొన్నారని పోలీసులు తెలిపారు.

వారణాసి నుండి అతుల్ కు మద్యం అందుతోందని పోలీసులు గుర్తించారు. మద్యం సరఫరా చేస్తున్నవారిని కూడ త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. అతుల్ కు సహకరించిన విశాల్ కుమార్, సంజీవ్ కుమార్, ఇంద్రజిత్ కుమార్  లను కూడ అరెస్ట్ చేశారు.

click me!