రైతు నేతలను ఉరితీయాలి... బీజేపీ ఎమ్మెల్యే సంచలనం

By telugu news teamFirst Published Jan 28, 2021, 7:29 AM IST
Highlights

ఢిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా హింసాకాండకు పాల్పడిన రైతు నాయకులను ఉరి తీయాలని బీజేపీ ఎమ్మెల్యే నందకిషోర్ గుర్జర్ డిమాండ్ చేశారు. 

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. గత కొంతకాలంగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా... ఈ ఆందోళన గణతంత్ర దినోత్సవం రోజున మరింత ఉద్రిక్తంగా మారింది. రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టి.. తమ రైతు జెండాను ఎగురవేశారు. ఈ క్రమంలో రైతులను అదుపుచేసేందుకు పోలీసులు కూడా ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఓ రైతు కూడా ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. ఈ వివాదంలో తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్ చేశాడు.

ఢిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా హింసాకాండకు పాల్పడిన రైతు నాయకులను ఉరి తీయాలని బీజేపీ ఎమ్మెల్యే నందకిషోర్ గుర్జర్ డిమాండ్ చేశారు. ఈ మేర ఎమ్మెల్యే గుర్జర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. హింసాకాండకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి వారిని కాల్చి చంపాలని గుర్జర్ కోరారు. 

హింసాకాండలో పాల్గొన్న రైతు నాయకులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఉరి తీయాలని నంద్ కిషోర్ కేంద్రమంత్రిని కోరారు.ట్రాక్టరు ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాకాండలో రైతు నాయకులు కూడా పాల్గొన్నారని ఢిల్లీ పోలీసు కమిషనర్ శ్రీవాస్తవ చెప్పారు.రైతు నాయకులు ర్యాలీ సందర్భంగా షరతులను పాటించలేదని, మధ్యాహ్నం 12 నుంచి 5 గంటల మధ్య నిరసనకు అనుమతిస్తే వారు ఉల్లంఘించారని, అందుకే 19 మంది నేతలను అరెస్టు చేసి, మరో 50మందిని అదుపులోకి తీసుకున్నామని పోలీసు చీఫ్ శ్రీవాస్తవ చెప్పారు.


 

click me!