లాక్ డౌన్ లో కార్మికులను విమానంలో బీహార్ కు పంపిన రైతు ఆత్మహత్య.. ఇంటిముందు గుడిలో ఉరివేసుకుని...

By Bukka SumabalaFirst Published Aug 24, 2022, 12:08 PM IST
Highlights

ఢిల్లీ అలిపొరా ప్రాంతానికి చెందిన పుట్టగొడుగుల రైతు పప్పన్ సింగ్ గెహ్లాట్ ఆత్మహత్య చేసుకున్నారు. లాక్ డౌన్ సమయంలో బీహారీ కార్మికులను విమానంలో తమ స్వస్థలాలకు పంపించి వార్తల్లో నిలిచారాయన.

న్యూఢిల్లీ : 2020 కోవిడ్ లాక్‌డౌన్‌తో ప్రపంచమంతా తలకిందులయ్యింది. రోజువారీ కూలీలు, వలస కూలీలు జీవనోపాధి కోల్పోయి.. ఉన్న ఊరికి వెళ్లలేక.. తిండికి లేక తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ఈ సమయంలో అనేక స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ముందుకు వచ్చి వారికి ఆహారంతో పాటు.. వారి నివాసాలకు పంపే ఏర్పాట్లు చేశారు. అలా తన దగ్గర పనిచేసే కార్మికులను విమానంలో వారి స్వస్థలమైన బీహార్‌కు పంపించి భేష్ అనిపించుకున్నారు రైతు పప్పన్ సింగ్ గెహ్లోట్ (55). ఆ సమయంలో పప్పన్ సింగ్ చేసిన పని దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. మార్గదర్శకత్వం వహించింది. 

అయితే ఆ రైతు పప్పన్ సింగ్ గెహ్లోట్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు షాక్ కు గురిచేస్తోంది. ఢిల్లీలోని ఓ ఆలయంలో బుధవారం ఆయన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అలిపోరా ప్రాంతంలోని తన ఇంటి ఎదురుగా ఉన్న గుడిలోని సీలింగ్ ఫ్యాన్ కు ఆయన ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు, తన ఆత్మహత్యకు అనారోగ్యమే కారణమని రాసిన సూసైడ్ నోట్ ఆ ప్రాంతంలో దొరికినట్లు పోలీసులు తెలిపారు. దీనిమీద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించినట్లు వెల్లడించారు. 

అవివాహితపై ఐదేళ్లుగా నకిలీ బాబా అత్యాచారం... వీడియో తీసి బ్లాక్ మెయిల్..

ఢిల్లీ అలిపొరా ప్రాంతంలో పుట్టగొడుగుల సాగు చేస్తారు పపప్పన్ సింగ్ గెహ్లోట్. ఆయన దగ్గర బీహార్కు చెందిన చాలామంది కార్మికులు పనిచేస్తున్నారు. 2020లో కరోనా మహమ్మారి కారణంగా.. కట్టడి దిశగా  ప్రభుత్వాలు తీసుకున్న చర్యల్లో భాగంగా..  విధించిన లాక్ డౌన్ తో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ స్వరాష్ట్రం చేరుకునేందుకు  అష్టకష్టాలు పడ్డారు. ఈ క్రమంలో తన వద్ద పనిచేసే కార్మికులకు విమాన టికెట్లు  కొనుగోలు చేసి బీహార్ కు పంపించారు పప్పన్ సింగ్ గెహ్లోట్. దీంతో  దేశం మొత్తం ఒక్కసారిగా ఆయన వైపు చూసింది. ఆయన చేసిన పనిని  మెచ్చుకుంది. ప్రశంసల వర్షం కురిపించింది. ఆతర్వాత కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టి లాక్ డౌన్ ఎత్తివేసిన క్రమంలో మళ్లీ విమానంలోనే వారిని తిరిగి పని ప్రదేశానికి తీసుకు వచ్చారు రైతు. 

click me!