Singer KK : ప్రముఖ గాయకుడు కేకే మృతి..

Published : Jun 01, 2022, 12:01 AM ISTUpdated : Jun 01, 2022, 12:06 AM IST
Singer KK : ప్రముఖ గాయకుడు కేకే మృతి..

సారాంశం

ప్రముఖ గాయకుడు కేకే (కృష్ణకుమార్ కున్నాత్) మృతి చెందారు. కోల్ కత్లాలో స్టేజ్ పై ప్రదర్శన ఇస్తుండగానే ఆయన కుప్పకూలిపోయాడు. హాస్పిటల్ కు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. 

ప్రముఖ గాయకుడు  కృష్ణకుమార్ కున్నాత్ (KK) హఠాత్తుగా మరణించారు. 53 ఏళ్ల ఈ బాలీవుడ్ సింగర్ గత మూడు దశాబ్దాలుగా భారతీయ సంగీత ప్రియులకు ఎన్నో హిట్‌లను అందించారు. కోల్‌కతాలో జరిగిన ఒక వేడుకలో ప్రత్యక్షంగా ప్రదర్శన ఇస్తుండగా ఆయ‌న కుప్ప‌కూలి మ‌ర‌ణించారు. 

 

దీంతో వెంట‌నే కేకేను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయ‌న అప్ప‌టికే మ‌ర‌ణించిన‌ట్టు డాక్ట‌ర్లు ప్రకటించారు. కేకే త‌న ప్రోగ్రాంకు సంబంధించిన ఫొటోల‌ను అంత‌కు ముందు త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ల ద్వారా పోస్ట్ చేశాడు. 

కేకే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బహుముఖ గాయకుడిగా పేరుగాంచారు. KK హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ వంటి అనేక భాషలలో పాటలను పాడారు. ఆయ‌న‌కుఏ భార్య, పిల్లలు ఉన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Top 10 Banks : ఇండియాలో అతిపెద్ద బ్యాంక్ ఏదో తెలుసా..? ఇన్ని లక్షల కోట్లా..!
Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ