బంగ్లాదేశ్ నుంచి ఈదుతూ భారత్‌లోకి.. లవర్‌ను పెళ్లి చేసుకోవడానికి యువతి ఏటికి ఎదురీత

Published : May 31, 2022, 08:22 PM IST
బంగ్లాదేశ్ నుంచి ఈదుతూ భారత్‌లోకి.. లవర్‌ను పెళ్లి చేసుకోవడానికి యువతి ఏటికి ఎదురీత

సారాంశం

అమ్మాయిది బంగ్లాదేశ్.. అబ్బాయిది భారత్‌. ఇద్దరూ ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యారు. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ప్రేమికుడిని పెళ్లి చేసుకోవడానికి ఆ యువతి ఏకంగా దేశ సరిహద్దులు దాటేసింది. సుందరబన్ అడవులను దాటి.. ఓ నది దాటి భారత్‌లోకి ప్రవేశించింది. ప్రియుడిని పెళ్లి చేసుకుంది. అక్రమంగా దేశంలోకి ప్రవేశించినందున పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.  

న్యూఢిల్లీ: సాధారణంగా సినిమాల్లో ప్రేమను నిలబెట్టుకోవడానికి, ప్రేమ పెళ్లి చేసుకోవడానికి సాధారణంగా యువకుడు లేదా హీరోనే లీడ్ తీసుకుంటాడు. ఆయనే పోరాడి ప్రేమను గెలుచుకుంటాడు. నిజ జీవితాల్లోనూ మహిళలకు అంతగా స్వేచ్ఛ ఉండదు. కానీ, క్రిష్ణ మండల్ మాత్రం ఇందుకు విరుద్ధం. తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవడానికి అన్ని పరిమితులను అధిగమించింది. ఏకంగా దేశ సరిహద్దులనే దాటేసింది. బెంగాల్ టైగర్‌గా ప్రతీతి పొందిన పులులు ఉన్న కారడవి నుంచి ధైర్యంగా నడుచుకుంటూ వెళ్లింది. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి గంటపాటు ఈదుతూ ఎంటర్ అయింది. తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి 22 ఏళ్ల వయసులో అన్ని సవాళ్లను ఆమె ఎదుర్కొంది. విజయవంతంగా అధిగమించింది. ఇండియాకు వచ్చి ప్రేమికుడిని పెళ్లి చేసుకుంది.

ఇండియా టుడే కథనం ప్రకారం, బంగ్లాదేశ్‌కు చెందిన క్రిష్ణ మండల్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన అభిక్ మండల్‌లు ఫేస్‌బుక్ వేదికగా కలుసుకున్నారు. స్నేహితులు అయ్యారు. వారి స్నేహం ప్రేమగా మారింది. ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. క్రిష్ణ మండల్‌కు పాస్ పోర్టు లేదు. కానీ, భారత్‌కు వచ్చి అభిక్ మండల్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. చివరకు చట్ట వ్యతిరేకంగానైనా దేశ సరిహద్దు దాటాలని నిర్ణయం తీసుకుంది. 

పోలీసు వర్గాల ప్రకారం, క్రిష్ణ మండల్ తొలుత సుందర్‌బన్ అడవుల్లోకి ఎంటర్ అయింది. ఈ అడవుల్లోనే రాయల్ బెంగల్ టైగర్స్ ఉంటాయి. కానీ, ఆమె ఆ విషయానికి జంకలేదు. ప్రియుడిని కలవాల్సిందేనని ముందుకే అడుగేసింది. ఆ తర్వాత ఆమె సుమారు గంటపాటు ఓ నదిలో ఈదుతూ ముందుకు సాగింది. ఆ తర్వాత ఆమె తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్నిచేరుకుంది.

ఎట్టకేలకు మూడు రోజుల క్రితమే క్రిష్ణ మండల్.. అభిక్ మండల్‌ను కోల్‌కతాలోనిచ కాలిఘాాట్ ఆలయంలో పెళ్లి చేసుకుంది. అయితే, దేశ సరిహద్దును అక్రమంగా దాటి వచ్చినందున పోలీసులు సోమవారం ఆమెను అరెస్టు చేశారు. ఆమెను బంగ్లాదేశ్ హై కమిషన్‌కు అప్పగించనున్నట్టు సమాచారం.

ఈ ఏడాదే ఓ టీనేజీ పిల్లాడు బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు సరిహద్దు గుండా ఈదుతూ ప్రవేశించాడు. తనకు ఇష్టమైన చాకోలేట్‌ను కొనుక్కోవడానికి ఆ టీనేజీ పిల్లాడు భారత్‌కు వచ్చాడు. ఎమన్ హొస్సెయిన్ చిన్న నది దాటి సరిహద్దులోకి అక్రమంగా ప్రవేశించాడు. సరిహద్దులోని ఫెన్సింగ్‌లో ఉన్న చిన్న గ్యాప్ గుండా భారత భూభాగంలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత పోలీసులు ఆ పిల్లాడిని అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?