కరోనా సంక్షోభం: సిబ్బందికి వేతనాలు ఇవ్వలేక, మూతపడిన ఫైవ్ స్టార్ హోటల్

By Siva KodatiFirst Published Jun 8, 2021, 2:33 PM IST
Highlights

కరోనాను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్ వల్ల ఆర్ధిక వ్యవస్ధ తీవ్రంగా కుదేలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే లక్షలాది మంది ఉపాధి లేక రోడ్డునపడగా.. కార్పోరేట్ రంగాల్లో కొలువులు సైతం కోల్పోయిన వారు ఎందరో. దీనికి తోడు థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఇంకెంత మంది జీవితాల్లో చిచ్చుపెడతాయోనని ఆర్ధిక నిపుణులు కలవరపడుతున్నారు. 

కరోనా వల్ల ఎక్కువగా ప్రభావితమైన రంగం హాస్పిటాలిటి. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులతో కళకళలాడే ఈ రంగం ఇప్పుడు  కోవిడ్ వల్ల తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. మహమ్మారి వల్ల పర్యాటక రంగంపై భారీగానే దెబ్బ పడింది. హోటళ్లు, ఆతిథ్య రంగం డీలా పడిపోయింది. పర్యాటకులు రాక, అతిథులు లేక హోటళ్లు వెలవెలబోయాయి. 

Also Read:గుడ్ న్యూస్ : దేశంలో లక్షకు తగ్గిన కొత్త కేసులు... పలురాష్ట్రాల ఆంక్షల్లో సడలింపులు...

తాజాగా ముంబైలోని ప్రఖ్యాత హయత్ రీజెన్సీ అనే ఫైవ్ స్టార్ హోటల్‌ను ‘నిరవధికంగా మూసేస్తున్నాం’ అని యాజమాన్యం ప్రకటించింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి సమీపంలోనే ఉండే హయత్ రీజెన్సీని ఏషియన్ హోటల్స్ (వెస్ట్) లిమిటెడ్ నిర్వహిస్తోంది.

అయితే, హోటల్ నిర్వహణకు మాతృ సంస్థ నుంచి ఇప్పటిదాకా నిధులు విడుదల కాలేదని హోటల్ అధికారి ఒకరు చెప్పారు. దీంతో ఉద్యోగులు, సిబ్బందికి కనీసం జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల హోటల్ కు సంబంధించిన అన్ని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు హోటల్ ను మూసేస్తున్నట్టు తెలిపారు.
 
click me!