షాపింగ్‌ మాల్‌లో చాక్లెట్‌ చోరీ చేసిన విద్యార్థిని.. వీడియో వైరల్ కావడంతో ఆత్మహత్య.. 

By Rajesh KarampooriFirst Published Nov 1, 2022, 2:33 AM IST
Highlights

పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దూర్‌ జిల్లాలో ఓ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. షాపింగ్ మాల్‌లో చాక్లెట్లు దొంగిలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మనస్థాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల్ వెలుపల నిరసనలు చేశారు. వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
 

పశ్చిమ బెంగాల్‌లో వివాదం చేసుకుంది.  ఓ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. అలీపుర్‌దూర్ జిల్లాలో షాపింగ్ మాల్‌లో చాక్లెట్లు దొంగిలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కళాశాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నాడు.స్థానికులు షాపింగ్ మాల్ బయట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పోలీసులు సమాచారం అందించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు  అలీపుర్‌దూర్‌ జిల్లా జైగావ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సుభాష్‌ పల్లిలో గ్రాడ్యుయేట్‌ మూడో సంవత్సరం చదువుతుంది. ఆ విద్యార్థిని సెప్టెంబరు 29న తన సోదరితో కలిసి ఆ ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లింది. అక్కడి నుంచి వెళ్లిపోతుండగా చాక్లెట్లు దొంగిలిస్తూ పట్టుబడింది. దుకాణం యాజమానికి క్షమాపణలు చెప్పి..  చాక్లెట్ కు డబ్బులు చెల్లించింది. అయితే ఈ ఘటనలో షాపులో ఉన్న వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఆ వీడియో వైరల్‌గా మారడంతో అవమానానికి గురై ఆ యువతి.. ఆదివారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్యహత్య చేసుకుంది. దీంతో స్థానికులు షాపింగ్ మాల్ వెలుపల నిరసన వ్యక్తం చేశారు . వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఘటనకు  గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం తీసుకున్న తర్వాత, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపినట్లు జైగావ్ ఇన్‌ఛార్జ్ అధికారి ప్రబీర్ దత్తా తెలిపారు. అంతే కాకుండా ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకుంటున్నమని తెలిపారు   

click me!