ఆర్థిక సమస్యలు.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

Published : Dec 04, 2020, 07:29 AM ISTUpdated : Dec 04, 2020, 07:35 AM IST
ఆర్థిక సమస్యలు.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

సారాంశం

కందీవాలీ వెస్ట్ ప్రాంతంలోని ఒక ఫ్లాట్‌లో వీరి కుటుంబం ఉంటోంది. మృతులలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ కేసులో పోలీసులు ఫారెన్సిక్ నిపుణుల సహాయం తీసుకుంటున్నారు. 


ఆర్థిక సమస్యల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ముంబయిలోని కాందీవలి ప్రాంతంలో చోటుచేసుకుంది. కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరి ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై చుట్టుపక్కల వారిని విచారిస్తున్నారు. కాగా.. సంఘటనాస్థలంలో పోలీసులకు ఓ సూసైడ్ నోట్ లభిస్తుంది. వీరి ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కందీవాలీ వెస్ట్ ప్రాంతంలోని ఒక ఫ్లాట్‌లో వీరి కుటుంబం ఉంటోంది. మృతులలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ కేసులో పోలీసులు ఫారెన్సిక్ నిపుణుల సహాయం తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా డీసీపీ విశాల్ ఠాకుర్ మాట్లాడుతూ ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని, వారికి ఆ ఇంటి యజమాని అజగర్ అలీతో పాటు అతని ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయన్నారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తున్నదన్నారు

PREV
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !