రైతుల ఆందోళనలు: పద్మ విభూషణ్‌ వెనక్కి ఇచ్చిన పంజాబ్ మాజీ సీఎం

By narsimha lodeFirst Published Dec 3, 2020, 4:30 PM IST
Highlights

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ న్యూఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు మద్దతుగా పద్మ విభూషణ్ పురస్కారాన్ని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్  వెనక్కి ఇచ్చారు.

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ న్యూఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు మద్దతుగా పద్మ విభూషణ్ పురస్కారాన్ని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్  వెనక్కి ఇచ్చారు.

న్యూఢిల్లీలో ఎనిమిది రోజులుగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇవాళ రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చిస్తోంది.పద్మ విభూషణ్ అత్యంత పౌర పురస్కారంగా భావిస్తారు. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకాష్ సింగ్ బాదల్ కు ఈ పురస్కారం అందించింది.

కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అకాళీదళ్ ఎన్డీఏ నుండి బయటకు వచ్చింది. ఈ చట్టాన్ని విరమించుకోవాలని ఆ పార్టీ కోరింది.ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్న రైతుల్లో పంజాబ్ రాష్ట్రం నుండి ఎక్కువ మంది రైతులున్నారు. పంజాబ్, మధ్యప్రదేశ్, యూపీ రాష్ట్రాల రైతులు కూడా ఉన్నారు.

కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.అయితే ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలనే విషయాన్ని కేంద్రం వ్యతిరేకిస్తోంది.

click me!