దొంగనోట్ల ముద్రణకు పాల్పడిన మాజీ హాకీ ప్లేయర్...ఎన్నికల కోసమే....

By Arun Kumar PFirst Published Oct 15, 2018, 4:13 PM IST
Highlights

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు చేపడులతున్న పోలీసులు భారీ మొత్తంలో దొంగనోట్లను స్వాధీనం చేసుకున్న సంఘటన మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ నకిలీ నోట్లను ముద్రిస్తున్న ముఠాలో ఓ మాజీ హాకీ క్రీడాకారుడు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.  అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ప్రలోభాలకు గురిచేయడానికి భారీ మొత్తంలో నకిలీ కరెన్సీ ముద్రణ జరుగుతున్నట్లు పట్టుబడ్డ ముఠా సభ్యుల ద్వారా తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కూడా ఒకటి. అయితే ఈ ఎన్నికల కోసం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. ముందస్తుగానే వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇలా భోపాల్ నగరంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులకు ఓ నఖిలీ నోట్ల ముద్రణా ముఠా పట్టుబడింది. ఓ వాహనంలో తరలిస్తున్న రూ.31 లక్షల రూ.500, రూ.2000 నోట్లను
పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కరెన్సీని తరలిస్తూ పట్టుబడ్డ నిందితులను విచారణలో పోలీసుల సంచలన విషయాలు బైటపెట్టారు.

ఈ నకిలీ నోట్ల ముద్రణ వ్యవహారంలో మధ్యప్రదేశ్ హాకీ మాజీ క్రీడాకారుడు ఆఫ్తాబ్ అలీ (42)  కీలకంగా వ్యవహరించిన పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఆఫ్తాబ్ అలీతోపాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 

ఇక ఈ నోట్లను ఎన్నికల్లో ఉపయోగించడానికే ముద్రించినట్లు నిందితులు వెల్లడించారు.  ఓ వ్యక్తి ఎన్నికల ఖర్చు కోసం మూడుకోట్ల రూపాయల నకిలీనోట్లను ముద్రించాలని ఆర్డరు ఇచ్చినట్లు నిందితులు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఈ ముఠాతో సంబంధమున్న ఆ వ్యక్తి కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

click me!