India poverty rate: భారత్‌లో పేదరికం తగ్గింది కానీ.. వరల్డ్ బ్యాంక్ నివేదికలో ఆసక్తికర అంశాలు

Published : Jun 08, 2025, 12:05 AM IST
extreme poverty

సారాంశం

India Poverty Report: వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం 2022-23లో భారత్‌లో కడు పేదరికం రేటు 5.3 శాతానికి తగ్గింది. 2011-12లో ఇది 27.1 శాతం ఉంది. ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పలు ఆసక్తికర విషయాలు ప్రస్తావించింది.

India Poverty Report: వరల్డ్ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం, భారతదేశంలో పేదరికం గణనీయంగా తగ్గిపోయింది. 2011-12లో 27.1 శాతంగా ఉన్న పేదరికం రేటు 2022-23లో 5.3 శాతానికి పడిపోయిందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ పేదరికం ప్రమాణాన్ని రోజుకు USD 3కి పెంచినప్పటికీ భారత్ ఈ మెరుగుదల సాధించిందని తెలిపింది.

 

 

భారత్ కడు పేదరికం రేటులో భారీ తగ్గుదల

USD 3/రోజు కొత్త ప్రమాణాన్ని ఆధారంగా తీసుకుంటే, 2011-12లో 34 కోట్లు (340 మిలియన్లు) దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. అయితే, 2022-23 నాటికి ఇది 7.5 కోట్లకు (75 మిలియన్లు) తగ్గారు. ఇది సుమారు 171 మిలియన్ల మందిని తీవ్ర పేదరికం నుంచి బయట పడేసినట్లు తెలిపింది. అంటే భారత్ లో పేదరికం నుంచి బయటపడిన వారు పేద్ద సంఖ్యలో ఉన్నారు.

పేదరికం పై నూతన ప్రమాణాల ప్రభావం

వరల్డ్ బ్యాంక్ అంతర్జాతీయ కడు పేదరికం రేఖను USD 2.15 (2017 PPP) నుంచి USD 3 (2021 PPP)కి పెంచింది. ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా 226 మిలియన్ల మందికి పేదరికంపై ప్రభావం చూపేలా చేసిందని పేర్కొంది. అయితే భారత్ డేటా నవీకరణ వల్ల ఈ గణన 125 మిలియన్లు మాత్రమేగా మిగిలిందని పీ.ఐ.బి (PIB) ఫాక్ట్‌షీట్ తెలిపింది.

2024లో భారతో లో పేదరికం పరిస్థితులు ఎలా ఉన్నాయి?

2024 నాటికి భారత్‌లో రోజుకు USD 3 కన్నా తక్కువ ఆదాయంతో జీవించే వారు 5.44 శాతంగా ఉన్నారు, అంటే 54,695,832 మంది. గ్రామీణ ప్రాంతాల తీవ్ర పేదరికం 2011-12లో 18.4 శాతం నుండి 2022-23లో 2.8 శాతానికి తగ్గింది. అదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో ఇది 10.7 శాతం నుండి 1.1 శాతానికి తగ్గింది. గ్రామీణ-పట్టణ తీవ్ర పేదరికం తేడా 7.7 శాతం పాయింట్ల నుంచి 1.7 శాతానికి తగ్గింది.

భారతదేశ పేదరికం.. ఆర్థిక స్థితిగతుల ప్రభావం

భారతదేశం వాస్తవ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY25) నాటికి కోవిడ్ పూర్వ స్థాయికి పోలిస్తే సుమారు 5 శాతం తక్కువగానే ఉందని నివేదిక పేర్కొంది. 2027-28 నాటికి వృద్ధి మళ్లీ సాధ్యమైన స్థాయికి చేరే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. ఇదే సమయంలో ప్రపంచ స్థాయిలో విధాన మార్పులు, వాణిజ్య ఉద్రిక్తతలు వంటి అంశాలు భారత్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని హెచ్చరించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే
Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?