మొట్ట మొదటి మహిళా డ్రైవర్.. ఇది కదా మహిళా సాధికారత..!

Published : Sep 04, 2021, 11:47 AM ISTUpdated : Sep 04, 2021, 11:50 AM IST
మొట్ట మొదటి మహిళా డ్రైవర్.. ఇది కదా మహిళా సాధికారత..!

సారాంశం

గత ఏడాది ఫిబ్రవరి 4 న రెండు పింక్ బస్సులను ప్రారంభించింది. అయితే మహిళా డ్రైవర్లు అందుబాటులో లేనందున, బస్సులు ఇప్పటి వరకు పురుషులు నడిపేవారు. ఇప్పుడు తాజాగా... మహిళా డ్రైవర్ ని నియమించారు.

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు మనం మహిళా ఉాద్యోగులను ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ లుగా  చూసి ఉంటాం. కానీ.. మహిళా డ్రైవర్లను చూసి ఉండరు. అయితే.. ఇండోర్ లో తొలిసారిగా ఓ మహిళా డ్రైవర్ విధుల్లో చేరారు.  మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పింక్ సిటీ బస్సు సర్వీసులను ప్రారంభించగా.. మొట్ట మొదటి మహిళా డ్రైవర్ నియమితులయ్యారు.

గత ఏడాది ఫిబ్రవరి 4 న రెండు పింక్ బస్సులను ప్రారంభించింది. అయితే మహిళా డ్రైవర్లు అందుబాటులో లేనందున, బస్సులు ఇప్పటి వరకు పురుషులు నడిపేవారు. ఇప్పుడు తాజాగా... మహిళా డ్రైవర్ ని నియమించారు.

కొన్ని నెలల క్రితం కార్పొరేషన్ ఇద్దరు మహిళా డ్రైవర్లను షార్ట్ లిస్ట్ చేయగా.. వారికి శిక్షణ  ఇవ్వడం ప్రారంభించారు. వారిలో రీతూ నర్వాలే అనే మహిళ డ్రైవర్ గా నియమితులయ్యారు.  ఆమె గత నెల చివరి వారంలో విధుల్లో చేరారు.  తెల్లవారుజామున 3 గంటల నంచి 5 గంటల మధ్యలో ఆమె టెస్ట్ డ్రైవ్  చేశారు. ఆమె బాగా డ్రైవింగ్ చేయగలుగుతారనే నమ్మకం వచ్చిన తర్వాత..  ఉదయం 7గంటలకు మొదటి డ్రైవ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కాగా.. ఆమె డ్రైవింగ్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?