ప్రియురాలిని కొట్టాడని ఆమె భర్తపై కాల్పులు జరిపాడో ప్రియుడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
గుజరాత్ : గుజరాత్ లోని భావ్‌నగర్ జిల్లాలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. భార్యాభర్తల మధ్య వాగ్వాదంలోకి దూరిన ప్రియుడు.. భర్త మీద కాల్పులు జరిపాడు. ఈ ఘటన సీసీ కెమెరాలో నమోదయ్యింది. ఇర్షాద్ అనే నిందితుడు జాహిద్ భార్య షహనాజ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
ఇర్షాద్ గతంలో షహనాజ్‌తో గొడవపడి ఆమెను కొట్టాడు, ఆ తర్వాత ఆమె గాయాలతో ఆసుపత్రిలో చేరింది. ఆసుపత్రిలో నమోదైన సిసిటీవీ ఫుటేజీలో ఇర్షాద్ జాహిద్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగి, ఆపై అతనిపై కాల్పులు జరుపుతున్నట్లు కనిపిస్తుంది.ఘటన ఆస్పత్రిలో జరగడంతో.. వెంటనే సిబ్బంది దీనిమీద పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫిర్యాదుతో పాటు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఇర్షాద్‌ను అదుపులోకి తీసుకున్నారు.