టీఎంసీ నేత ఇంట్లో భారీ పేలుడు.. ముగ్గురు కార్యకర్తల మృతి.. ఎన్ఐఏతో దర్యాప్తు చేయాలని బీజేపీ డిమాండ్ ..

By Rajesh KarampooriFirst Published Dec 3, 2022, 10:32 AM IST
Highlights

పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లా భూపతినగర్‌లో భారీ పేలుడులో సంభవించింది. ఈ ఘటనలో  ముగ్గురు టీఎంసి కార్యకర్తలు మరణించారు. మిడ్నాపూర్ జిల్లాలోని కాంటాయ్‌లో టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ భేటీకి ముందు భూపతినగర్‌లో పేలుడు సంభవించింది. టీఎంసీ నేత రాజ్‌కుమార్ ఇంట్లో ఈ పేలుడు జరిగినట్లు సమాచారం.

పశ్చిమ బెంగాల్‌లోని పూర్బా మేదినీపూర్ జిల్లా భూపతినగర్‌లో భారీ పేలుడులో సంభవించింది.  మేదినీపూర్ జిల్లాలోని నరియాబెలియా గ్రామంలోని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) స్థానిక బూత్ అధ్యక్షుడి నివాసంలో శుక్రవారం రాత్రి బాంబు పేలడంతో ముగ్గురు కార్యకర్తలు మరణించారు.

బ్లాక్ ప్రెసిడెంట్ రాజ్‌కుమార్ మన్నాతో పాటు..  పేలుడులో అతని మరో ఇద్దరు సోదరులు దేబ్‌కుమార్ మన్నా, బిస్వజిత్ గయెన్ గా గుర్తించారు.  ఈ గ్రామానికి సమీపంలో టిఎంసి జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ శనివారం సమావేశం జరుగనున్నది. ఈ ప్రాంతానికి కేవలం ఒకటిన్నర కిలోమీటరు దూరంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి మన్నా నివాసం దాదాపు దగ్ధమైనట్లు పోలీసు వర్గాలు, స్థానిక గ్రామస్తులు తెలిపారు.

ఈ పేలుడు ఘటనపై బీజేపీ స్పందించింది. మన్నా ఇంట్లో బాంబును తయారు చేస్తున్నప్పుడు పేలుడు సంభవించినట్టు బిజెపి ఆరోపించింది.జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. అయితే.. బీజేపీ ఆరోపణలను టిఎంసి  ఖండించింది. ఈ ఘటనతో  పార్టీకి ఎటువంటి పాత్ర లేదని పేర్కొంది. బెనర్జీ ర్యాలీని దెబ్బతీసేందుకు మన్నా ఇంటిపై బిజెపి దాడి చేసిందని టిఎంసి పేర్కొంది.

ఈ ఘటనపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ తన ట్విట్టర్ వేదికగా  స్పందించారు. “తూర్పు మేదినీపూర్‌ జిల్లాలోని టీఎంసీ నాయకుడి ఇంట్లో ముడి బాంబును తయారు చేస్తున్నప్పుడు మరో బాంబు పేలుడు సంభవించింది. ఆయనతోపాటు మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. పంచాయతీ ఎన్నికల ముందు భయానక వాతావరణం సృష్టించేందుకు టీఎంసీ ప్రయత్నిస్తోందని పేర్కోన్నారు. 

ఇంతలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి స్పందిస్తూ.. “పుర్బా మేదినీపూర్ జిల్లా, భాగబన్‌పూర్ II బ్లాక్, భూపతినగర్‌లో టిఎంసి నాయకుడి ఇంట్లో బాంబు పేలుడు సంభవించడంతో ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు  తీవ్రంగా గాయపడ్డారు. టిఎంసి నేత రాజ్‌కుమార్ మన్నా తన ఇంట్లో బాంబులు తయారు చేస్తుండగా ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనపై ఎన్ఐఏ చేయాలని దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

click me!