తాను చెప్పిన సర్ఫ్ భర్త తేలేదని... పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య...!

Published : Dec 03, 2022, 09:56 AM IST
  తాను చెప్పిన సర్ఫ్ భర్త తేలేదని... పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య...!

సారాంశం

 ఓ మహిళ మాత్రం... ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను చెప్పిన బ్రాండ్ సర్ఫ్ కాకుండా... వేరే బ్రాండ్ సర్ఫ్ తెచ్చాడనే కారణంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.


భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉండటం  చాలా కామన్. పాలు, టీ, కూరగాయలు, సర్ఫ్ లాంటి వాటి కోసం కూడా దంపతులు గొడవలు పడుతూ ఉంటారు. తర్వాత వారే కలిసిపోతారు. అయితే... ఓ మహిళ మాత్రం... ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను చెప్పిన బ్రాండ్ సర్ఫ్ కాకుండా... వేరే బ్రాండ్ సర్ఫ్ తెచ్చాడనే కారణంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్ పూర్  పోలీసులకు ఓ చిత్రమైన కేసు ఎదురైంది. నవంబర్ 23వ తేదీన ఆ ప్రాంత పోలీసులకు  ఓ మహిళ నుంచి ఫిర్యాదు అందింది. తన భర్త మీద ఆమె ఫిర్యాదు చేసింది అది కూడా సర్ఫ్ ప్యాకెట్ కోసం కావడం గమనార్హం. తాను చెప్పిన బ్రాండ్ కాకుండా వేరే బ్రాండ్ సర్ఫ్ తెచ్చాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు విని పోలీసులు సైతం షాకయ్యారు. ఇలాంటి కేసుకి ఎలాంటి పరిష్కారం చెప్పాలా అని వారు తలలు బాదుకున్నారు.

చివరకు ఈ కేసు మహిళా పోలీస్ స్టేషన్ వరకూ చేరింది. సర్ఫ్ విషయంలో తలెత్తిన గొడవ.. చివరకు భార్యాభర్తలూ విడిపోయే వరకూ వచ్చింది. అయితే... పోలీసులు వారికి సర్ది చెప్పారు. కౌన్సిలింగ్ ఇచ్చి... భార్యభర్తలు విడిపోకుండా చేశారు. కాగా... ఇలాంటి చిత్ర విచిత్ర కేసులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయని పోలీసులు చెప్పడం గమనార్హం.
 

PREV
click me!

Recommended Stories

IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే