విషాదం : ఇంట్లోని ఏసీలో పేలుడు.. తల్లీ, ఇద్దరు కూతుర్లు సజీవదహనం...

Published : Mar 07, 2023, 08:04 AM IST
విషాదం : ఇంట్లోని ఏసీలో పేలుడు.. తల్లీ, ఇద్దరు కూతుర్లు సజీవదహనం...

సారాంశం

ఇంట్లోని ఏసీ పేలడంతో తల్లీ, ఇద్దరు కూతుర్లు సజీవదహనం అయిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

కర్ణాటక : కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరులో ఓ విషాదకర ఘటన స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది. ఇంట్లో మంటలు చెలరేగి తల్లి, ఇద్దరు కూతుర్లు సజీవ దహనం అయ్యారు. సోమవారం మధ్యాహ్నం రాయచూరు తాలూకా శక్తి నగర్ కెపిసిఎల్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారిని రంజిత (33), మృదుల (13), తారుణ్య(5)గా  గుర్తించినట్లు శక్తి నగర్ పోలీస్ స్టేషన్  సిబ్బంది తెలిపారు. ఇంట్లోని ఏసీలో మంటలు చెలరేగడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని అనుమానిస్తున్నారు. అయితే, ఇంట్లో మంటలు పూర్తిగా అలుముకోవడానికి స్పష్టమైన కారణాలు తెలియ రాలేదు. 

ఈ ఘటన మీద సమాచారం అందడంతో రాయచోటి ఎస్పీ సత్యనారాయణ, శక్తి నగర్ పిఎస్ఐ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిస్తున్నారు. శక్తి నగర్ థర్మల్ కేంద్రంలో ఏఈగా పనిచేస్తున్న సిద్ధ లింగయ్య  కుటుంబం ఈ ప్రమాదానికి  గురైంది. సిద్ధ లింగయ్య మండ్య జిల్లాకు చెందిన వ్యక్తి. ప్రమాదం జరిగిన సమయంలో సిద్ధ లింగయ్య ఇంట్లో లేరు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను రిమ్స్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మంటల కారణంగా అలుముకున్న దట్టమైన పొగ చుట్టుపక్కల ఇళ్లకు కూడా వ్యాపించింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. 

పోలీస్ స్టేషన్ లోపలే విషం తాగిన అత్యాచార బాధితురాలు.. ఎందుకంటే..

ఇదిలా ఉండగా, ఈ ఫిబ్రవరిలో కేరళలోని కన్నూర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. కారులో మంటలు చెలరేగడంతో గర్భిణి సహా ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు. మృతులను ప్రజిత్, అతని భార్య రీషాగా గుర్తించారు. ఈ విషాద సంఘటన కన్నూర్ నగరంలోని జిల్లా ఆసుపత్రి సమీపంలో ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నారు. కారు నడుపుతున్న గర్భిణి భర్త, గర్భిణి ముందు సీట్లలో, మరో నలుగురు వెనుక సీట్లలో ఉన్నారు. 
ప్రమాదం జరగగానే వెంటనే వెనకసీట్లలో ఉన్న నలుగురు కారులో నుంచి బయటపడ్డారు. కానీ కారు డోర్ జామ్ కావడంతో ముందు సీట్లో ఉన్న ఇద్దరు తప్పించుకోలేకపోయారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి సహా వెనుక సీట్లలో కూర్చున్న నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.ఆరుగురు సభ్యుల కుటుంబం ఆసుపత్రికి వెడుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ఒక నివేదికలో తెలుస్తోంది. మృతులను కుట్టియత్తూరు స్థానికులు రీషా (26), ఆమె భర్త ప్రజిత్ (32)గా గుర్తించారు. 

ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులైన స్థానికులు, తొలుత డ్రైవింగ్ సీటులో ఉన్న ప్రజిత్ కాళ్లకు మంటలు అంటుకున్నాయని చెప్పారు. అతను వెంటనే కారు ఆపి వెనుక తలుపులు తెరిచాడని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ మలయాళ మనోరమ తెలిపింది. వెనుక ఉన్న వ్యక్తులు కారు నుండి బయటకు పరుగెత్తుతుండగా, ప్రజిత్ ముందు తలుపు తెరవడంలో విఫలమయ్యాడు. కారులో ఇరుక్కుపోయిన దంపతులు మంటల్లో చిక్కుకున్నారు. ఆ జంట సహాయం కోసం కేకలు వేయడంతో ఏం చేయలేక స్థానికులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారని సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Tourism : ఏమిటీ.. 2025 లో 135 కోట్ల పర్యాటకులా..! ఆ ప్రాంతమేదో తెలుసా?
Silver Price Hike Explained in Telugu: వెండి ధర భయపెడుతోంది? | Asianet News Telugu