ఎంత దారుణం.. వరద బాధితులకు ఇలాంటివా డొనేట్ చేసేది..?

By ramya neerukondaFirst Published Aug 21, 2018, 10:34 AM IST
Highlights

పేరుకు సహాయం చేస్తున్నామనే ముసుగుతో కాలం చెల్లిన మందులు, చినిగిపోయిన పాత దుస్తులను వారికి అందజేస్తున్నారు. కాగా.. దీనిపై అక్కడి వాలంటీర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

భారీ వర్షాలు, వరదలతో కేరళ అతలాకుతలం అయ్యింది. దీంతో.. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందిస్తున్నారు. అయితే.. ఈ సహకారం మాటున చాలా మంది తమ కుటిల బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. పేరుకు సహాయం చేస్తున్నామనే ముసుగుతో కాలం చెల్లిన మందులు, చినిగిపోయిన పాత దుస్తులను వారికి అందజేస్తున్నారు. కాగా.. దీనిపై అక్కడి వాలంటీర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

తిరువనంతపురం నగరంలోని నిషాగండీ సేకరణ కేంద్రంలో కాలం చెల్లిన ఔషధాలు, బేబీ ఫుడ్స్, రెడీ టు ఈట్ ఆహార పదార్థాలు, డైపర్లు వచ్చాయి. కాలం చెల్లిన మందులు పెద్ద సంఖ్యలో రావడంతో వీటిని ఎలా పంపిణీ చేయాలని వాలంటీర్లు ప్రశ్నిస్తున్నారు.దాతలు ఎక్స్‌పైరీ డేట్ మీరిన మందులను విరాళంగా అందించవద్దని వాలంటీర్లు కోరుతున్నారు. 

కొందరు పాత దుస్తులు, మురికి దుస్తులు కూడా ఇస్తుండటంతో వాటిని వరద బాధితులకు ఎలా ఇస్తామని వాలంటీర్లు ప్రశ్నిస్తున్నారు. మురికి దుస్తులను ఉతికించిన తర్వాత ఇవ్వాలని వాలంటీర్లు నిర్ణయించారు. కాగా కొందరు దాతలు పెద్ద మనసుతో కొత్త దుస్తులు కొనుగోలు చేసి బాధితులకు అందిస్తున్నారు. ఆర్టెక్ సమ్రుధి తంపురాన్స్ అపార్టుమెంట్ అసోసియేషన్ లక్షరూపాయలతో దుస్తులు కొనుగోలు చేసి బాధితులకు అందజేసిందని వాలంటీర్ సుమయ్య షబ్బీర్ చెప్పారు.

click me!