ఘోర వైఫల్యం... ఇక రాజకీయాలకు కమల్ స్వస్తి..?

By telugu news teamFirst Published May 8, 2021, 7:34 AM IST
Highlights

తొలిసారి ఎన్నికల్లో కొంచమైనా ప్రాబల్యం చూపించే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే.. ఆ అంచనాలన్నీ తారుమారు అయ్యాయి. కనీసం కమల్ కూడా విజయం సాధించలేదు.

తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల్లో సినీ నటుడు కమల్ హాసన్ ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకున్నారు. తమిళ రాజకీయాల్లో తనదైన మార్పు తీసుకువస్తానంటూ ఆయన  ఈ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గ్లామర్ ఫీల్డ్ నుంచి వచ్చారు.. అభిమానులు కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి.. తొలిసారి ఎన్నికల్లో కొంచమైనా ప్రాబల్యం చూపించే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే.. ఆ అంచనాలన్నీ తారుమారు అయ్యాయి. కనీసం కమల్ కూడా విజయం సాధించలేదు.

ఈ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా సాధించుకోలేకపోయారు. దీంతో.. మనస్థాపంతో పలువురు నేతలు పార్టీని కూడా వీడారు. ఓటమితో కాకపోయినా.. ఇలా కీలక నేతలంతా తన పార్టీని వీడి వెళ్లిపోవడంతో..  కమల్ తీవ్రంగా మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఆ కారణంగా ఆయన రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారని  కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి . ఈ మేరకు ఆయన త్వరలోనే నిర్ణయం వెలువరించనున్నారని తెలుస్తోంది.

 కమల్‌ సారథ్యంలోని ‘మక్కల్‌ నీది మయ్యం’ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోవడం, స్వయంగా ఆయన కూడా ఓడిపోవడంతో పార్టీ కార్యకర్తల్లో, అభిమానుల్లో నైరాశ్యం నెలకొంది. దీనికితోడు పార్టీకి చెందిన పలువురు నేతలు పదవుల నుంచి వైదొలగుతున్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్‌ సైతం తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా కమల్‌ పార్టీ పట్ల ప్రజల్లో అంతగా ఆసక్తి లేకపోవడం, ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడం, తాను వ్యతిరేకించే భావజాల పార్టీలు అధికారానికి దూరం కావడం తదితర కారణాల నేపథ్యంలో కమల్‌ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోనున్నట్టు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

click me!