#assamexitpollresult2021:అస్సాం ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్: సీఎం పీఠం ఏ పార్టీదంటే?

By S Ashok Kumar  |  First Published Apr 29, 2021, 8:23 PM IST

నేడు కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, బెంగాల్ రాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ ఓటింగ్ ముగిసిన ఒక గంట తర్వాత విడుదలయ్యాయి. అయితే ఈ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అనే ఉత్కంట అందరిలో మొదలైంది.
 


అస్సాం రాష్ట్రంలో నేడు మూడు దశల్లో ఓటింగ్ ముగిసింది. మొదటి పోలింగ్ మార్చి 27న, రెండవ పోలింగ్ ఏప్రిల్ 1న, మూడవ పోలింగ్ ఏప్రిల్ 6న జరిగింది. ప్రస్తుతం అస్సాంలో బిజెపి పార్టీ ప్రభుత్వంలో ఉంది. అస్సాంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పిఎం మోడీ, హోంమంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఎన్నికలలో భాగంగా బహిరంగ సమావేశాలు నివారించారు. అయితే ఈ సమావేశాలలో సిఎఎ, తేయాకు తోటలలో పనిచేసే కార్మికుల సమస్యలు ఎక్కువగా చర్చించబడింది. అలాగే  కాంగ్రెస్ పార్టీ  రాష్ట్రానికి ఐదు హామీలు కూడా ఇచ్చింది. 

 అస్సాంలో బిజెపితో కాంగ్రెస్ పోటీ చేస్తుందా ?
126 సీట్లతో అస్సాం శాసనసభ కాలం మే 31 తో ముగుస్తుంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 15 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్‌ను అధికారం నుంచి తొలగించింది. 2016 ఎన్నికల్లో బిజెపి 86 సీట్లు గెలుచుకోగా సర్బానంద సోనోవాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. 

Latest Videos

undefined


ఎగ్జిట్ పోల్ అంటే ఏమిటి?
ఓటింగ్ రోజున ఓటరు బయటకు వచ్చినప్పుడు మీరు ఏ పార్టీకి ఓటు వేశారని పోల్స్టర్లు అతనిని అడుగుతారు, అలాంటి సర్వేను ఎగ్జిట్ పోల్ అంటారు.  

ఎగ్జిట్ పోల్స్ రిసల్ట్ ఎవరు నిర్వహిస్తారు?

టుడేస్ చాణక్య, ఎబిపి-సివోటర్, న్యూస్ 18, ఇండియా టుడే-యాక్సిస్, టైమ్స్ నౌ-సిఎన్ఎక్స్, న్యూస్ఎక్స్-నేతా, రిపబ్లిక్-జాన్ కి బాత్, రిపబ్లిక్-సివోటర్, ఎబిపి-సిఎస్డిఎస్, చింతామణి వంటి ప్రైవేట్ సంస్థలు, మీడియా సంస్థలు ఈ పోల్స్ నిర్వహిస్తున్నాయి. .

రిపబ్లిక్-సిఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం పార్టీల వారీగా అంచనాలు- బిజెపి (60-66 సీట్లు), కాంగ్రెస్ (26-28 సీట్లు), ఎజిపి (10-14), ఎఐయుడిఎఫ్ (11-13), బిపిఎఫ్ (5- 7), యుపిపిఎల్ (3-5) మరియు ఇతరులు (1-3). ఏ‌జి‌పి, ఏ‌ఐ‌డి‌యూ‌ఎఫ్, బి‌పి‌ఎఫ్ లను మినహాయించి మిగతా పార్టీలన్నీ గత ఎన్నికలకు భిన్నంగా అధిక సీట్లు సాధించాయి. బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించడంతో ఎన్డిఎ 44.25% ఓట్లు సాధిస్తుందని అంచనా వేయగా, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాజోత్ (యుపిఎ) 39.65% ఓట్లు సాధిస్తుందని అంచనా. ఇతర రాజకీయ పార్టీలకు 16.10% వాటా వచ్చే అవకాశం ఉంది.

అస్సాం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
అస్సాం అసెంబ్లీకి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇక్కడ ఉన్నాయి. 126 మంది సభ్యుల అసెంబ్లీలో మెజారిటీ గుర్తు 64.

ఎబిపి-సి ఓటరు
ఎన్డీఏ: 58-71
కాంగ్రెస్ +: 53-66
ఇతరులు: 0-5

పి-మార్క్
బిజెపి కూటమి -62-70
కాంగ్రెస్ కూటమి -56-64
ఇతరులు -0-4

ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా
బిజెపి కూటమి -75-85
కాంగ్రెస్ కూటమి -40-50
ఇతరులు -1-4

రిపబ్లిక్ టీవీ-సిఎన్ఎక్స్
బిజెపి కూటమి -74-84
కాంగ్రెస్ కూటమి -40-50
ఇతరులు -1-3

click me!