#keralaexitpollresult2021:కేరళలో ఎల్ డి ఎఫ్ ఘన విజయం... ఇండియా టుడే సర్వే

Arun Kumar P   | Asianet News
Published : Apr 29, 2021, 08:21 PM IST
#keralaexitpollresult2021:కేరళలో ఎల్ డి ఎఫ్ ఘన విజయం... ఇండియా టుడే సర్వే

సారాంశం

ఎల్ డి ఎఫ్ , యూడి ఎఫ్ కూటముల మధ్య హోరాహోరీగా సాగిన పోరులో    104‌-120  సీట్లతో  ఎల్ డి ఎఫ్ విజయం సాధిస్తుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ పేర్కొంది.   

కేరళ ఎన్నికల్లో ఈసారి అధికారం ఎల్ డి ఎఫ్ కూటమి సొంతం చేసుకుంటుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ పేర్కొంది. ఎల్ డి ఎఫ్ , యూడి ఎఫ్ కూటముల మధ్య హోరాహోరీగా సాగిన పోరులో    104‌-120  సీట్లతో  ఎల్ డి ఎఫ్ విజయం సాధిస్తుందని ఈ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. 

ఇండియా టుడే సర్వే:

ఎల్డీఎప్  104‌-120

యూడిఎఫ్  20-36

ఎన్డీఏ 0-2

ఇతరులు 0-2 

రాష్ట్రంలోని 140 సీట్లకు గాను ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతలో ఎన్నిక జరిగింది. రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుండి ఎంపీగా గెలుపొందడం, శబరిమల అంశము అన్ని వెరసి జాతీయ నాయకత్వమంతా కేరళలో తిష్ట వేసింది. ప్రధానంగా ఎల్ డి ఎఫ్, యూ డి ఎఫ్ కూటముల మధ్య పోరు సాగినప్పటికీ... తమ ప్రాబల్యాన్ని పెంచుకొని రాష్ట్ర రాజకీయాల్లో ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ సైతం ఇక్కడ భారీ ఎత్తున ప్రచారం సాగించింది. 

కేరళలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారడమనేది ఒక నిత్యకృత్యంగా తయారయింది. దేశంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కూడా కేరళనే. ఈ రాష్ట్రాన్ని నిలబెట్టుకొని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని ఎల్ డి ఎఫ్ రంగంలోకి దిగింది. 

దేశవ్యాప్తంగా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న కాంగ్రెస్ కి ఈ రాష్ట్రం గెలవడం అత్యవసరం. ఇక్కడ విజయం సాధించడం ద్వారా మొత్తం కాంగ్రెస్ క్యాడర్ లో ఒక జోష్ తీసుకురావొచ్చని వారు భావిస్తున్నారు. దానికి తోడు ఇక్కడ విజయాన్ని సాధించడాం ద్వారా రాహుల్ గాంధీ నాయకత్వానికి కూడా ఒక ఆమోదముద్ర పడుతుందని అనుకుంటున్నారు. 

ఇక శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంలో కమ్యూనిస్టు ప్రభుత్వం వ్యవహరించిన తీరును బీజేపీ సాధ్యమైనంత మేర వాడుకుంది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఈ అంశం కలిసివస్తాదని భావించినప్పటికీ... అది అంతలా కలిసిరాలేదు. 2021 అసెంబ్లీ ఎన్నికలలోనయినా తమ ప్రభావాన్ని పెంచుకోవాలని వారు భావిస్తున్నారు. 

ప్రస్తుతానికి ఇవి ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రమే, నిజమైన ఫలితాలు కావాలంటే మే 2వ తేదీ వరకు ఆగవలిసిందే..!

PREV
click me!

Recommended Stories

Ukrainian Woman Lidia Lakshmi Slams YouTuber Anvesh Over Comments Hindu Gods | Asianet News Telugu
అయోధ్య రామమందిరానికి హై సెక్యూరిటీ.. ఎలాగో తెలుసా?