Kerala’s Thrissur స్కూల్లో తుపాకీతో కాల్పులకు మాజీ విద్యార్ధి:అంతా సేఫ్

By narsimha lode  |  First Published Nov 21, 2023, 2:01 PM IST

కేరళ రాష్ట్రంలో ఓ స్కూల్ లో మాజీ విద్యార్థి కాల్పులకు దిగాడు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే  నిందితుడిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. 


తిరువనంతపురం:కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ లో  ఎయిర్ ఫిస్టల్ తో స్కూల్ కు వచ్చి బెదిరింపులకు దిగిన మాజీ విద్యార్ధినిని పోలీసులు మంగళవారంనాడు అరెస్ట్ చేశారు.జగన్ అనే విద్యార్ధి  ఎయిర్ ఫిస్టల్ తో  స్కూల్ వచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడు.  అతడిని ఇవాళ ఉదయం  10:45 గంటలకు  అరెస్ట్ చేశారు.త్రిసూర్‌లోని వివేకోదయం బాలుర హయ్యర్ సెకండరీ స్కూల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

స్కూల్ స్టాఫ్ రూమ్ లోకి ప్రవేశించి ఉపాధ్యాయులను బెదిరించారు. అంతేకాదు  క్లాస్ రూమ్ లో మూడుసార్లు కాల్పులకు దిగాడని టీచర్లు తెలిపారు. నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా  స్థానికులు అతడిని వెంటాడి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. త్రిసూర్ ఈస్ట్ పోలీసులు నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. నిందితుడు డ్రగ్స్ కు బానిస అని  పోలీసులు గుర్తించారు.

Latest Videos

స్కూల్ లోని  స్టాఫ్ రూమ్ లోకి వెళ్లి  తన జేబులోంచి ఎయిర్ గన్ తీసి టీచర్లను బెదిరించాడు. అంతేకాదు  పక్కనే ఉన్న క్లాస్ రూమ్ కు వెళ్లి  విద్యార్ధులను బెదిరించాడు. క్లాస్ రూమ్ లో మూడు రౌండ్లు కాల్పులకు దిగాడు.

త్రిసూర్ ఈస్టో పోలీసులు  జగన్ ను ప్రశ్నిస్తున్నారు. త్రిసూర్ సిటీ క్రైం బ్రాంచ్ కు చెందిన ఏసీపీ, మరికొందరు  అతడిని  విచారిస్తున్నారు. జగన్  ఎందకు  స్కూల్ కు వచ్చి  తుపాకీతో కాల్పులకు దిగాడనే విషయమై  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

click me!