ఢిల్లీ లిక్కర్ స్కామ్.. మనీష్ సిసోడియాను వెంటాడుతున్న కష్టాలు.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు..

By Sumanth Kanukula  |  First Published Nov 21, 2023, 1:35 PM IST

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కష్టాలు వెంటాడుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది.


ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కష్టాలు వెంటాడుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని డిసెంబరు 11 వరకు రౌస్ అవెన్యూ కోర్టు ఈరోజు  ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని సుదీర్ఘంగా విచారించిన కోర్టు.. నిందితులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇంకా అనేక పత్రాలు దాఖలు చేయాల్సి ఉందని పేర్కొంది. 

ఇదిలా ఉండగా.. కేసు విచారణను ప్రారంభించేందుకు వీలుగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి) సమ్మతి సెక్షన్ 207ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని న్యాయవాదుల పట్ల కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. బెనోయ్ బాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై నవంబర్ 24 న వాదనలు వింటామని తెలిపింది. 

Latest Videos

ఇక,ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సిసోడియా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. సీబీఐ ప్రకారం.. మనీష్ సిసోడియా నేరపూరిత కుట్రలో అత్యంత ముఖ్యమైన, కీలకమైన పాత్రను పోషించారు. కుట్ర లక్ష్యాలను సాధించేందుకు వీలుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ రూపొందించడంలో, అమలు చేయడంలో కీలకంగా పాల్గొన్నారు.

click me!