
పిబ్రవరి 14... ప్రేమ జంటలు ఎన్నో రోజులుగా ఎదురుచూసే రోజు. ఇలా కేవలం ప్రేమికుల కోసమే ప్రత్యేకించబడిన ఈ రోజున బయటకు వెళ్లి సరదాగా గడపాలని ప్రేమికులు భావిస్తుంటారు. కానీ బజరంగదళ్, సంఘ్ పరివార్ వంటి కొన్ని హిందుత్వ సంస్థల భయంతో వారు బయటకు రావడానికే భయపడిపోతున్నారు. ఇలా భపడిపోతున్న ప్రేమ జంటలకు ప్రేమికుల రోజు సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపి శశి థరూరు ఓ సలహా ఇచ్చాడు.
ప్రేమికుల రోజును పాశ్యాత్య సంస్కృతిలో భాగమంటూ మిమ్మల్సి ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే మన పూర్వీకులు జరుపుకునే కామధేవ దివస్ గురించి గుర్తుచేయాలని శశి థరూర్ సూచించారు. ఇలా తమ పూర్వీకుల సాంప్రదాయాన్నే తాము ఫాలో అవుతున్నామని సంఘ్ పరివార్, దాని అనుంబంధ సంస్థల సభ్యులకు గట్టిగా జవాభివ్వాలని థరూర్ తెలిపారు. తమకు ఇష్టమైన ప్రెండ్స్ తో ఇవాళ బయటకు వెళ్లడానికి ఎవరు భయపడ్డవద్దని శశి థరూర్ ధైర్యం చెబుతూ...ప్రేమికుల ధినోత్సవ శుభాకాంక్షలను ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఇలా శశి థరూర్ ప్రేమికుల రోజు సంధర్భంగా చేసిన ట్వీట్ పై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఆయన ప్రేమ జంటలకిచ్చిన సలహాను స్వాగతించారు. మరికొందరు ఇలా దేశ సంస్కృతిని నాశనం చేసేవారి మాటలను పట్టించుకోవద్దని ఘాటుగా జవాభిస్తున్నారు.