
న్యూఢిల్లీ : National Stock Exchange (ఎన్‌ఎస్‌ఇ) మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ Chitra Ramkrishna, భారతదేశంలోని అతిపెద్ద స్టాక్ మార్కెట్‌లో "Himalayan Yogi" అని పిలిచే వ్యక్తితో రహస్య సమాచారాన్ని పంచుకోవడంతో సహా తీవ్ర వైఫల్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
అరెస్టుకు ముందు బెయిల్ కోసం ఆమె చేసిన అభ్యర్థనను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. గత నాలుగు సంవత్సరాలుగా ఆమెపై వచ్చిన ఆరోపణల మీద దర్యాప్తును స్తబ్ధంగా ఉంచినందుకు, "లాక్‌డైసిక్"గా ఉంచినందుకు గానూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)ని కోర్టు తప్పుపట్టింది. ఇది జరిగిన ఒక రోజు తర్వాత అరెస్టు జరిగింది.
మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నిందితురాలిమీద "చాలా కరుణతో" ఉందని, ఆమె మీద తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని.. నిజాలను వెలికితీసేందుకు ఆమెను కస్టడీ విచారణ జరపడం అవసరమని ప్రత్యేక న్యాయమూర్తి సంజీవ్ అగర్వాల్ అబ్జర్వ్ చేశారు.
చిత్రా రామకృష్ణ నిర్ణయాలను ప్రభావితం చేసిన రహస్య "హిమాలయ యోగి" ఆనంద్ సుబ్రమణియన్ గా గత నెలలో వెలుగులోకి వచ్చింది. మార్కెట్ మానిప్యులేషన్ కేసులో అరెస్టయిన అతను స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో మాజీ అధికారి కూడా పనిచేశారు. యోగి ప్రభావంతో చిత్రా రామకృష్ణ తీసుకున్న నిర్ణయాలలో అతన్ని నియమించడం కూడా ఒకటని.. అది వివాదాస్పదమైనదని సెబీ ఒక నివేదికలో పేర్కొంది.
SEBI ఏప్రిల్ 2013 నుండి డిసెంబర్ 2016 వరకు NSE MD and CEO గా పనిచేసిన చిత్రా రామకృష్ణ మీద.. సుబ్రమణియన్ నియామకం, అతని అవుట్‌సైజ్డ్ ప్రమోషన్ పై ఆరోపణలు, పనితీరు మీద అభ్యంతరాలు వచ్చాయని అభియోగాలు మోపింది. వివాదాస్పద సలహాదారుతో పరస్పర చర్యల గురించి ఎన్‌ఎస్‌ఇ, దాని బోర్డుకు తెలుసునని అయితే "విషయాన్ని గోప్యంగా ఉంచాలని" భావించినట్లు పేర్కొంది.
అదే సమయంలో, "కో-లొకేషన్ స్కామ్"గా పిలవబడే దానిలో మార్కెట్ ఎక్స్ఛేంజీల కంప్యూటర్ సర్వర్ల నుండి స్టాక్ బ్రోకర్లకు సమాచారం అందిందనే ఆరోపణలపై కూడా సిబిఐ విచారణ జరుపుతోంది. కొంతమంది బ్రోకర్లకు బిజినెస్ లో విపరీతమైన లాభం జరిగిందని 2018లో దాఖలు చేసిన కేసులో గత నెలలో ఏజెన్సీ ఆమెను నాలుగు రోజుల పాటు ప్రశ్నించింది.
"ఈ ప్రశ్నల సమయంలో, NSETECH CTO (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్) మురళీధరన్ నటరాజన్‌కు కో-లొకేషన్ సర్వర్ గురించి తెలియదని పేర్కొంటూ రామకృష్ణ తప్పించుకునే సమాధానాలు ఇచ్చారు" అని వర్గాలు NDTVకి తెలిపాయి.
అప్పటి ఆనంద్ సుబ్రమణియన్‌తో పాటు చిత్రా రామకృష్ణను సోమవారం దేశ రాజధానిలోని సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు. వారిద్దరినీ కలిసి విచారించాలని ఏజెన్సీ యోచిస్తోంది. దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకే వారు ఉనికిలో లేని 'యోగి'ని ప్రవేశపెట్టినట్లు అనుమానిస్తున్నారు. NSE నుండి రహస్య సమాచారాన్ని బయటి వ్యక్తులతో పంచుకోవడం, ఆ సమాచారంతో లాభం పొందిన వారిని కనిపెట్టడానికి కూడా ఏజెన్సీ ప్రయత్నిస్తోంది. వివాదాలపై బహిరంగ విమర్శలకు ప్రతిస్పందనగా, NSE "అత్యున్నత ప్రమాణాల పాలన, పారదర్శకతకు కట్టుబడి ఉంది" అని పేర్కొంది. ఈ సమస్యను "దాదాపు ఆరు నుండి తొమ్మిదేళ్ల నాటిది" అని వివరించింది.