ముస్లిం పాలకులు అలా చేస్తే.. ఏ ఒక్క హిందువు కూడా మిగిలేవాడు కాదు : రిటైర్డ్ జడ్జి  వివాదాస్పద వ్యాఖ్యలు

By Rajesh KarampooriFirst Published Dec 2, 2022, 10:59 PM IST
Highlights

కర్ణాటకలో మరోసారి హిందూ-ముస్లిం వివాదం తలెత్తింది. కర్ణాటకలోని విజయపుర నగరంలో రిటైర్డ్ జిల్లా జడ్జి వసంత్ ముల్సావలగి మాట్లాడుతూ.. ఏడు వందేళ్ల ముస్లింల పాలనలో హిందువులను ఎదిరించి ఉంటే..  హిందువులు మనుగడ సాగించేవారు కాదని అన్నారు. వారు అలా చేసి ఉంటే.. ఒక్క హిందువు కూడా మిగిలి ఉండేవాడు కాదని, అయినా ఇప్పటికీ దేశంలో ముస్లింలు ఎందుకు మైనారిటీగా  ఉన్నారు? అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటకలో మరోసారి హిందూ-ముస్లిం వివాదం తలెత్తింది. కర్ణాటకలోని విజయపుర నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో రిటైర్డ్ జిల్లా జడ్జి వసంత్ ముల్సావలగి మట్లాడుతూ..  హిందువులు, ముస్లింలకు సంబంధించిన పలు విషయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.   హిందూ దేవుళ్లైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కేవలం నవలలోని పాత్రలేనని వారు చారిత్రక వ్యక్తులు కాదని  రిటైర్డ్ జిల్లా జడ్జి  సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే.. ఏడు వందేళ్ల ముస్లింల పాలనలో హిందువులను ఎదిరించి ఉంటే..  హిందువులు మనుగడ సాగించేవారు కాదని, ఒక్క హిందువు కూడా మిగిలి ఉండేవాడు కాదని, అయినా ఇప్పటికీ దేశంలో ముస్లింలు ఎందుకు మైనారిటీగా  ఉన్నారు? అని అన్నారు. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

వాస్తవానికి  కర్ణాటకలోని విజయపుర నగరంలో గురువారం నాడు'రాష్ట్రీయ సౌహార్ద్ వేదిక్' తదితర సంస్థల ఆధ్వర్యంలో  ఓ సదస్సు నిర్వహించారు. 'రాజ్యాంగం యొక్క లక్ష్యాలు నెరవేరాయా?' అనే ఆంశంపై  రిటైర్డ్ జిల్లా జడ్జి వసంత్ ముల్సావలగి ప్రసంగిస్తూ .. 'హిందువులను ముస్లింలు మత మార్పిడి చేయించారనే చెప్పే వారు.. మొదటగా.. భారతదేశంలో 700 సంవత్సరాల ముస్లిం పాలన  చరిత్ర ఏమి చెబుతుందో తెలుసుకోవాలి. మొఘల్ చక్రవర్తి అక్బర్ భార్య హిందువుగానే ఉండిపోయిందని, ఆమె ఇస్లాంలోకి మారలేదని ఆయన అన్నారు. అక్బర్ తన ప్రాంగణంలో కృష్ణుని ఆలయాన్ని నిర్మించాడు. ప్రజలు ఇప్పటికీ చూడవచ్చని అన్నారు. ముస్లింల పాలనలో  హిందువులను వ్యతిరేకించి ఉంటే..  దేశంలో ఒక్క హిందువు కూడా మిగిలి ఉండేవారు కాదు. ముస్లీంలు మరోలా అనుకుంటే..  హిందువులందరినీ ఎప్పుడో చంపేసి ఉండేవారు. అన్ని వందల ఏళ్లు ముస్లింలు ఈ దేశాన్ని పాలించినా వారు మైనారిటీలుగానే ఉన్నారు. ఎందుకు అలా మిగిలిపోయారు?’’ అని ప్రశ్నించారు.  

‘‘హిందూ దేవుళ్లైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు గురించి  మాట్లాడుతున్నప్పుడు.. రాముడు . శ్రీకృష్ణుడు కేవలం ఒక నవలలో పాత్రలు మాత్రమేననీ, వారు చారిత్రక పురుషులు కాదు. అశోక చక్రవర్తి మాత్రం నిజమైన చారిత్రక పురుషుడని అన్నారు. ఉత్తరాఖండ్‌లోని శివలింగంపై బుద్ధుని చిత్రాలను చిత్రించారు. ఈ మేరకు బౌద్ధ అనుచరులు పిటిషన్ దాఖలు చేశారు. దేవాలయాలను మసీదులుగా మార్చేశారని కొందరు వాదిస్తున్నారు. అసలు దేవాలయాలు నిర్మించకముందే అశోక చక్రవర్తి 84 వేల బౌద్ధ విహారాలను నిర్మాంచారు. మరి అవి ఎక్కడ ఉన్నాయో చెప్పగలరా? అని ప్రశ్నించారు. బౌద్ధ విహారాల ఆచూకీని పెద్ద సమస్యగా మార్చగలరా?’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక రాజ్యాంగంపై ఆయన మాట్లాడుతూ... ‘‘రాజ్యంగ లక్ష్యాలు స్పష్టంగా, కచ్చితంగానే ఉన్నాయని అన్నారు. కానీ, ఆ లక్ష్యాలను నెరవేర్చడంలో వ్యవస్థ విఫలమవుతోందని అన్నారు. రాజ్యాంగ లక్ష్యాలు స్పష్టంగా,ఖచ్చితమైనవి అని ఆయన అన్నారు. కానీ రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చడంలో వ్యవస్థ విఫలమవుతోంది. ఈ దిశగా యువ తరం అప్రమత్తంగా ఉండాలనీ, దేవాలయాలు, చర్చిలు, మసీదులను యథాతథంగా ఉంచాలని 1999లో చట్టం వచ్చిందన్నారు. అయితే ఈ విషయంలో జిల్లా కోర్టు పరస్పర విరుద్ధమైన నిర్ణయం తీసుకుందని అన్నారు.  .

ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలపై కొంత మంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొందరు హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేయగా..  మరి కొందరు చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మరి కొందరు ములసావలగి చెప్పింది అక్షరాల నిజమని ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. చరిత్ర వాస్తవాలు నవలల నుంచి కాకుండా మూలాల నుంచి చూడాలని, అప్పుడే వాస్తవాలు బయటికి తెలుస్తాయని ఆయనను సమర్ధిస్తున్నారు.

click me!