సీపీఎం నేత సీతారాం ఏచూరిని కలిసిన హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా

By Siva KodatiFirst Published Sep 9, 2022, 3:29 PM IST
Highlights

సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరిని కలిశారు హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా. త్వరలో జరగనున్న సమ్మాన్ దివాస్‌కు ఏచూరి ఆహ్వానించారు చౌతాలా.

సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరిని కలిశారు హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా. ఈ సందర్భంగా హర్యానాలో జరిగే సమ్మాన్ దివాస్‌కు ఏచూరి ఆహ్వానించారు చౌతాలా. అనంతరం ఏచూరి మాట్లాడుతూ.. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమౌతున్నాయన్నారు. విపక్షాలు ఏకం కావడం మంచి పరిణామమని.. మునుగోడులో బీజేపీని ఓడించేది టీఆర్ఎస్సేనని , అందుకే మద్ధతిచ్చామని ఏచూరి పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. 

మరోవైపు కొద్దిరోజుల క్రితం జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా సీతారాం ఏచూరిని కలిసిన సంగతి తెలిసిందే. బీజేపీపై పోరులో కలిసి రావాలని ఆయనను కోరారు. 2024 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్ర‌తిప‌క్షాల‌ను ఏకం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా సాగిన త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం అయ్యింద‌ని జనతాదళ్ (యునైటెడ్) చీఫ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. కాషాయ ద‌ళానికి వ్య‌తిరేకంగా పోరాడే ప్ర‌య‌త్నంలో భాగంగా తాను ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను క‌లిశాన‌ని పేర్కొన్నారు. 

ALso REad:మూడు నెలల్లో ప్రతిపక్ష పార్టీల నుంచి ప్రధాని అభ్యర్థిని ఖరారు చేస్తాం - బీహార్ సీఎం నితీష్ కుమార్

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రెండు మూడు నెలల్లో ప్ర‌తిపక్షాల నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిని ఖరారు చేస్తామని చెప్పారు. ‘ప్రతిపక్ష నేతలను ఏకం చేసేందుకు నా పని నేను చేస్తున్నాను. నా ప్రయత్నాలు కొనసాగుతాయి. త్వరలో ప్రతిపక్ష నేతలు ఏకమవుతారని, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు అందరూ సహకరిస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ప్రధానమంత్రి అభ్యర్థిపై తుది నిర్ణయం రెండు మూడు నెలల్లో వస్తుంది. ప్రస్తుత అయితే నేను ప్రతిపక్ష పార్టీల ప్రధానమంత్రి అభ్యర్థిని కాను ’’ అని ఆయన అన్నారు.

బీజేపీ గత విధానాలకు దూరమైందని, పూర్తిగా మారిపోయిందని కుమార్ ఆరోపించారు. ‘‘ బీజేపీ ఇప్పుడు మారిన పార్టీ. ఇది అటల్ జీ కాలంలో ఉన్న బీజేపీ కాదు. బీజేపీ విధానాలు, కథనాలు ఇప్పుడు మారాయి ’’ అని బీహార్ సీఎం పేర్కొన్నారు. తన విమర్శలు చేసిన వారిపై మండిపడిన నితీష్ కుమార్.. తమ పార్టీ, ప్రభుత్వం అభివృద్ధి పనులును చేపట్టడాన్ని విశ్వసిస్తుందని అన్నారు.
 

click me!