ఒడిశా రైలు ప్రమాద బాధితులకు నష్టపరిహారం ప్రకటించిన కేంద్రం.. 

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విచారం వ్యక్తం చేశారు. పరిహారం కూడా ప్రకటించారు. అలాగే..సంఘటనా స్థలానికి బయలుదేరారు.

Google News Follow Us

ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం జరిగింది.  కోల్‌కతా సమీపంలోని షాలిమార్ స్టేషన్ నుండి చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొనడంతో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా మృతి చెందగా, దాదాపు 200 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను సోరో, గోపాల్‌పూర్‌, ఖంట‌పాడ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌కు త‌ర‌లించారు. క్షత‌గాత్రుల్లో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. క్షత‌గాత్రుల సంఖ్యకు కూడా పెరిగే అవకాశముంది. 

ఇదిలా ఉంటే..  రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.  క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అలాగే మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. భువనేశ్వర్, కోల్‌కతా నుంచి రెస్క్యూ టీమ్‌లను రప్పించామని, NDRF, రాష్ట్ర ప్రభుత్వం బృందాలు, వైమానిక దళం కూడా సమాయత్తమైందని, అవసరమైన ఇతర బలగాల సహాయం కూడా తీసుకుంటామని ట్వీట్ చేశారు.  

అదే సమయంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ఘటన బాధితులకు నష్ట పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి ₹10 లక్షలు, తీవ్రంగా గాయపడిన ప్రయాణికులకు రూ.2 లక్షలు, స్వల్పగాయాలైన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు.
 

హెల్ప్‌లైన్ నెంబర్లు

సహాయక చర్యల కోసం రైల్వే అధికారులు హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు.

షాలిమార్ : 9903370746
ఖరగ్‌పూర్ : 8972073925, 9332392339
బాలేశ్వర్ : 8249591559, త7978418322
హౌరా : 033-26382217