ఆర్టికల్ 370 రద్దుపై రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సంచలన వ్యాఖ్యలు 

Published : Feb 13, 2023, 06:11 AM ISTUpdated : Feb 13, 2023, 07:49 AM IST
ఆర్టికల్ 370 రద్దుపై రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సంచలన వ్యాఖ్యలు 

సారాంశం

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన ప్రభుత్వ సంకల్పానికి తుది మెరుగులు దిద్దేందుకు 2019 జూన్ 26న కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్ పర్యటన చేశారని లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) కె.జె.ఎస్. ధిల్లాన్ పేర్కొన్నాడు.

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన ప్రభుత్వ సంకల్పానికి తుది మెరుగులు దిద్దేందుకు 2019 జూన్ 26న కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్ పర్యటించారని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కె.జె.ఎస్. ధిల్లాన్ తన ఇంకా విడుదల చేయని 'కిత్నే ఘాజీ ఆయే కిత్నే ఘాజీ గయే' పుస్తకంలో పేర్కొన్నాడు.

జమ్మూ కాశ్మీర్ (J&K)లో ఆర్టికల్ 370ని రద్దు చేయాలన్న మోదీ ప్రభుత్వ చర్యకు చివరి నిమిషంలో అమిత్ షా పర్యటించారనీ, జూన్ 26, 2019న అమిత్ షా పర్యటన నాటకీయ ప్రకటనకు నాంది అని , ఇప్పటికే ప్రచారం జరిగిందని ఆయన పేర్కోన్నారు. ఆ సమయంలో లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) KJS ధిల్లాన్ శ్రీనగర్‌కు చెందిన XV కార్ప్స్‌కు అధిపతిగా వ్యవహరించారు. ఆయన  తన పుస్తకంలో .. తనకు తెల్లవారుజామున 2 గంటలకు ఫోన్ కాల్ వచ్చిందని , హోం మంత్రితో ఉదయం 7 గంటలకు సమావేశం గురించి సమాచారం అందిందని పేర్కోన్నారు.
 
హోం మంత్రితో జరిగిన సమావేశంలో చాలా సున్నితమైన అంశాలు , కీలకమైన అంశాలు చర్చనీయంగా మారాయని తెలిపారు. హోం మంత్రి సంపూర్ణ నియంత్రణలో ఉన్నారని , ఎజెండాతో పూర్తిగా అవగాహన కలిగి ఉన్నారని తెలిపారు.  కేంద్ర హోం మంత్రి స్పష్టంగా విస్తృత పరిశోధన, హోంవర్క్ చేశాడని అని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ చెప్పారు. "పాత్ బ్రేకింగ్ డిక్లరేషన్"ని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ ఎలా స్పందిస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ చర్చ దోహదం చేసిందని తెలిపారు. సమావేశం ముగింపులో.. "నా స్పష్టమైన, వ్యక్తిగత దృక్పథం గురించి నన్ను అడిగారు, నా తక్షణ ప్రతిస్పందన.. 'అగర్ ఇతిహాస్ లిఖ్నా హై, తో కిసీ కో ఇతిహాస్ బనానా పడేగా' (మనం చరిత్ర సృష్టిస్తేనే చరిత్రను వ్రాయగలము)", అని ధిల్లాన్ పుస్తకంలో పేర్కోన్నట్టు తెలిపారు.

  2019 ఆగస్టు 5న ప్రభుత్వం శ్రీనగర్‌లో జరిగిన చివరి సమావేశం, ఇది జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును,  జమ్మూ కాశ్మీర్ , లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని ప్రకటించింది.

రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ మాట్లాడుతూ.. సరిహద్దు అవతల నుండి అసత్యాలు ప్రచారం చేయబడినందున అధికారులు ఇంటర్నెట్‌ను మూసివేయవలసి వచ్చిందని, అలాగే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవాలని అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు కాశ్మీర్‌లో స్థానిక ఆర్మీ కమాండ్‌కు నాయకత్వం వహించిన ఆయన( దిల్లాన్) లక్ష్యం సాధించబడిందని తను గర్వంగా చెప్పబుతున్నానని పుస్తకంలో రాశారు. దక్షిణ కాశ్మీర్‌లోని లెత్‌పోరా సమీపంలో 2019లో ఆత్మాహుతి కారు బాంబు దాడిలో మరణించిన 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బందికి గౌరవసూచకంగా ధిల్లాన్ రచించిన 'కిత్నే ఘాజీ ఆయే కిత్నే ఘాజీ గయే' ఫిబ్రవరి 14న విడుదల కానుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే