దొంగతనం అడ్డుకోబోయిన ఆర్మీ అధికారి... కొట్టి చంపిన దుండగులు

Published : Jul 29, 2019, 10:46 AM IST
దొంగతనం అడ్డుకోబోయిన ఆర్మీ అధికారి... కొట్టి చంపిన దుండగులు

సారాంశం

తన ఇంటి పక్కన ఓ దుకాణంలో చోరీ జరుగుతుండగా చూసిన ఆయన దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కాగా... దుండగులు ఆయనను అతి కిరాతకంగా కొట్టి చంపేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమేథిలో చోటుచేసుకుంది.

తన కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించిన ఓ మాజీ ఆర్మీ అధికారి... ఈ ప్రయంత్నంలో తన ప్రాణాలు కోల్పోయారు. తన ఇంటి పక్కన ఓ దుకాణంలో చోరీ జరుగుతుండగా చూసిన ఆయన దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కాగా... దుండగులు ఆయనను అతి కిరాతకంగా కొట్టి చంపేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమేథిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... శనివారం రాత్రి మాజీ ఆర్మీ అధికారి అమానుల్లా, అతని భార్య ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా... ఆ సమయంలో వారి ఇంటి పక్కనే ఉన్న దుకాణంలో దొంగలు పడ్డారు. గమనించిన అమానుల్లా దొంగల ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులను పిలుస్తానంటూ దొంగలను హెచ్చరించారు. 

దీంతో.. కోపంతో ఊగిపోయిన ఆ దుండగులు... కర్రలతో ఆయనపై దాడి చేశారు. తలకు తీవ్రమైన గాయం తగలడంతో అమానుల్లా అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా... ఈ ఘటనపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉత్తరప్రదేశ్ లో నేరాలు అదుపుచేయడంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విఫలమయ్యిందటూ మండిపడ్డారు. రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?