ముఖ్యమంత్రి తీపి కబురు: ప్రతి రైతు అకౌంట్లోకి నేరుగా 4వేలు

Published : Oct 12, 2019, 08:20 AM IST
ముఖ్యమంత్రి తీపి కబురు: ప్రతి రైతు అకౌంట్లోకి నేరుగా 4వేలు

సారాంశం

రాష్ట్రంలోని 11.5లక్షల మంది రైతుల అకౌంట్లలో 452 కోట్లను జమ చేయనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కో రైతుకి 4వేల రూపాయలను ఇవ్వనున్నట్టు తెలిపాడు. ఈ పెట్టుబడి సహాయం నేరుగా రైతుల అకౌంటులో జమ చేయనున్నట్టు ప్రకటించారు. 

రాంచి: జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఆ రాష్ట్ర రైతులకు ఎన్నికల వేళ ఒక తీపి కబురు చెప్పారు. రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కో రైతుకి 4వేల రూపాయలను ఇవ్వనున్నట్టు తెలిపాడు. ఈ పెట్టుబడి సహాయం నేరుగా రైతుల అకౌంటులో జమ చేయనున్నట్టు రఘుబర్ దాస్ ప్రకటించారు. 

లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేసారు. రాష్ట్రంలోని 11.5లక్షల మంది రైతుల అకౌంట్లలో 452 కోట్లను జమ చేయనున్నట్టు జార్ఖండ్ ముఖ్యమంత్రి తెలిపారు. 

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికే ఇలాంటి తాయిలాలు ప్రకటిస్తున్నారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఈ సంవత్సరాంతం నవంబర్-డిసెంబర్ మాసాల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

ప్ర‌తిప‌క్షాల‌కు మోదీ, షా మాస్ట‌ర్ స్ట్రోక్‌.? మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు వీగినా బీజేపీకే లాభ‌మా.?
వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఓటింగ్ ఎలా జరిగింది? | Asianet News Telugu