కరోనా అనంతరం దుష్పరిణామాలు పెరుగుతున్నాయా?.. స్వల్ప తీవ్రతతో సోకినా సమస్యలే: ఎయిమ్స్ వైద్యులు

Published : Apr 24, 2022, 03:06 PM ISTUpdated : Apr 24, 2022, 03:20 PM IST
కరోనా అనంతరం దుష్పరిణామాలు పెరుగుతున్నాయా?.. స్వల్ప తీవ్రతతో సోకినా సమస్యలే: ఎయిమ్స్ వైద్యులు

సారాంశం

కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారిలో ఆటో ఇమ్యూన్ కారణంగా కలిగే దుష్పరిణామాలను చూస్తున్నామని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. స్వల్ప తీవ్రతతో ఈ వైరస్ సోకినా దీర్ఘకాలిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఈ ఆటో ఇమ్యూన్ కారణంగా రుమటాయిడ్ ఆర్థిరిటిస్, ఫీవర్, నీరసం, కళ్లు నోరు పొడిబారడం వంటి సమస్యలు వస్తున్నాయని తెలిపారు.  

న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకున్నవారిలో ఆటో ఇమ్యూన్ సమస్యలు చూస్తున్నామని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. కరోనా వైరస్ స్వల్ప తీవ్రతతో సోకినా.. దీర్ఘకాలికంగా దాని దుష్పరిణామాలు ఎదురు కావొచ్చని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ దీర్ఘకాలిక సమస్యలను సూచిస్తున్న ఆటో ఇమ్యూన్‌తో  బాధపడుతున్న సుమారు 30 కేసుల వరకు తాము పరిశీలించామని వివరించారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఆటో ఇమ్యూన్ కారణంగా వారు రుమటాయిడ్ ఆర్థిరిటిస్, ఫీవర్, కళ్లు నోరు పొడిబారడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ఆటో ఇమ్యూన్ సమస్య అంటే.. సాధారణంగా మన దేహంలోని రోగ నిరోధక వ్యవస్థ మన బాడీకి చెందిన కణాలు, ప్రోటీన్ టిష్యూలు, అవయవాలను, మొత్తంగా మన బాడీపై దాడి చేయదు. మన దేహంలోకి బయటి నుంచి వచ్చి వ్యాపిస్తున్న కణాలపై మాత్రమే అది దాడి చేస్తుంది. కానీ, ఆటో ఇమ్యూన్ సమస్య కారణంగా ఈ రోగ నిరోధక వ్యవస్థ మన దేహపు కణాలను గుర్తించే సామర్థ్యం మందగిస్తుంది. తద్వార అది మన బాడీపైనే దాడి చేస్తుంది. దీన్నే ఆటో ఇమ్యూనిటీ అంటారు.

ఎయిమ్స్‌లో రుమటాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ ఉమా కుమార్ ఈ విషయంపై మాట్లాడుతూ, కరోనా నుంచి కోలుకున్న కనీసం 30 పేషెంట్లలో ఆటో ఇమ్యూన్ సమస్యలను చూశామని వివరించారు. ఈ ఆటో ఇమ్యూన్ సమస్యలో కొవిడ్ పాత్ర ఉన్నదని తెలిపారు. వీరంతా ఏదో ఒక సమయంలో కరోనా బారిన పడ్డారు. దాని నుంచి రివకరీ అయినవారేనని చెప్పారు. వారిలో ఆర్థిరిటిస్, లుపుస్, ఫీవర్, నీరసం, కళ్లు, నోరు పొడిబారడం, బాడీ వాపెక్కడం, చర్మం ఎరుపెక్కడం వంటి ఆటో ఇమ్యూన్ లక్షణాలు కనిపించాయని 
పేర్కొన్నారు.

అయితే, ఈ ఆటో ఇమ్యూన్ సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పలేమని పేర్కొన్నారు. ఎందుకంటే.. తమ వద్దకు సుమారు 30 మంది ఈ సమస్యలతో వచ్చారని వివరించారు. వారందరిలోనూ గతంలో ఈ సమస్యలు లేవని, కరోనా నుంచి రికవరీ అయిన తర్వాతే ఈ కొవిడ్ కాంప్లికేషన్స్ ఎదురయ్యాయని తెలిపారు. ఈ సమస్య ఏ స్థాయిలో వ్యాపించి ఉన్నదో కనుగొనాలంటే.. కమ్యూనిటీ స్థాయిలో సర్వే చేయాల్సి ఉంటుందని వివరించారు. అలాగైతేనే.. ఆటో ఇమ్యూన్ కేసులు ఏ స్థాయిలో పెరిగాయో కనుగొనవచ్చని తెలిపారు. కొవిడ్ వైరస్ ఆటో ఇమ్యూన్ కాంప్లికేషన్స్‌తోనే దీర్ఘకాలిక దుష్పరిణామాలను కలుగచేస్తున్నదని పేర్కొన్నారు.

ఈ సమస్యలు ఎదుర్కొంటున్న పేషెంట్ల వయసు ఎక్కువగా 18 నుంచి 50 ఏళ్ల వారే ఉన్నారు. సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వచ్చి వెళ్లిపోయిన తర్వాత ఈ కేసులు కనిపించడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం