
Nest Man of India: ఢిల్లీలోని అశోక్ విహార్‌లో నివసిస్తున్నరాకేష్ ఖత్రీ ఓ పర్యావరణ ప్రేమికుడు. ఆయనకు పక్షులంటే.. అమితమైన ప్రేమ. తిండీ, గూడు లేక ఆకలితో అలమటిస్తూ పక్షులను చూసి.. ఆయన మనస్సు చలించింది. తన వంతు సాయంగా ఆ చిన్న ప్రాణులకు ఏదైనా చేయాలని భావించారు. అనుకున్నదే.. తడువుగా.. పక్షి గూళ్లను నిర్మించాలనే ఓ మహ యజ్ఞానికి శ్రీకారం చూట్టాడు. ఆ యజ్ఞ ఫలితమే.. ఇప్పటివరకు ఆయన 2.5 లక్షలకు పైగా పక్షి గూళ్లు నిర్మించారు. అందరి చేత నెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా పిలిపించుకుంటున్నారు. ఆయన నిస్వార్థ సేవకు గుర్తింపు అనేక అవార్డులు వరించాయి.
దేశ రాజధాని ఢిల్లీలో గూళ్లు లేని పక్షులను కాపాడే లక్ష్యంతో రాకేశ్ ఖత్రీ పక్షులకు గూళ్లు కట్టాలనీ, ఇప్పటి వరకూ 2.5 లక్షలకు పైగా గూళ్లను నిర్మించాడు. ఆయన ప్రముఖ మీడియా సంస్థలో మాట్లాడుతూ.. తన చిన్నతనం నుంచి పక్షులంటే.. ఎంతో ఇష్టమనీ, వాటితో చాలా ఇష్టంగా ఆడుకునే వాడననీ, అప్పటి నుంచి వాటి కోసం గూళ్లు వేయడం ప్రారంభించాననీ అంటారు రాకేశ్ ఖత్రీ. ఇప్పటి వరకు, తన జీవితంలో 2.5 లక్షలకు పైగా గూళ్లు నిర్మించాననీ, ప్రజల గుండెల్లో గూడు కట్టుకోవడానికి ఎక్కువ సమయం పట్టదన్నారు. లక్షలాది మంది విద్యార్థులకు గూళ్లు నిర్మించడ నేర్పించనని తెలిపారు. మొదట్లో తనని ఎగతాళి చేస్తూ.. మీరు కట్టిన గూడులోకి పక్షులు ఎలా ప్రవేశిస్తాయని అడిగారు. కానీ, మనం కట్టుకున్న గూళ్లలోకి పక్షులు ప్రవేశించడం ప్రారంభించడంతో, అవి కూడా తమ ఇళ్లలో గూళ్లు ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించాయని ఆయన చెప్పారు.
COVID-19 మహమ్మారి సమయంలో గూళ్లు నిర్మించడంపై అనేక వెబ్‌నార్లను నిర్వహించననీ, జనపనార, ప్లాస్టిక్, గడ్డి, కలప మొదలైన వాటితో గూళ్ళు ఎలా తయారు చేయాలో ప్రజలకు నేర్పిస్తాననీ ఖత్రీ తెలియజేశాడు. పక్షులకు కూడా నివాసం ఉండాలనే సదుద్దేశం మనసులో ఉంటే గూళ్లు ఎలా నిర్మించాలో నేర్చుకోవటానికి ఎంతో సమయం పట్టదంటున్నారు రాకేశ్ ఖాత్రి.
ఆయన పక్షులకు చేస్తున్న సేవకు గుర్తింపుగా.. ఇప్పటివరకు ఆయన మొత్తం ఐదు అవార్డులను అందుకున్నాడు. అత్యధికంగా పక్షుల గూళ్లు చేతితో తయారు చేసిన వ్యక్తిగా అతని పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ 2019లో నమోదయ్యింది. అలాగే.. ఇంటర్నేషనల్ గ్రీన్ యాపిల్ అవార్డు, లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ అవార్డు, అలాగే..రాకేష్ ఖత్రి 12 భాషల్లో 11,2000 మంది విద్యార్థులతో వాతావరణ మార్పులపై రూపొందించిన డాక్యుమెంటరీకి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం దక్కింది.
జనపనార ఉపయోగించి 1,25,000 గూళ్లు కట్టినందుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కింది. పక్షులకు సేవ చేస్తున్నందుకు ఆయనను అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. అంతే కాకుండా.. ఈ ఏడాది నుంచి రాకేశ్ ఖత్రి జీవిత చరిత్రను ICSC బోర్డ్ 4వ తరగతి ఇంగ్లీష్ బుక్‌లో ప్రవేశపెట్టింది. సంప్రదాయ విధానాలతో పిల్లలో అత్యుత్తమ పనితీరును కనపరించినందుకు జాతీయ అవార్డును అందుకున్నారు.