చాయ్ వాలాగా మారిన ఇంజనీరింగ్ విద్యార్థులు.. రోజుకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?

Published : Aug 17, 2023, 03:39 PM IST
చాయ్ వాలాగా మారిన ఇంజనీరింగ్ విద్యార్థులు.. రోజుకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?

సారాంశం

ఇంజనీరింగ్ చేసి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలని చాలా మంది కలలగంటారు. ఈ ఆశయంతోనే ఇంజనీరింగ్ లోకి అడుగుపెడతారు. కానీ ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మాత్రం ఇంజనీరింగ్ చదివి టీ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అంతేకాదు మంచి లాభాలను కూడా పొందుతున్నారు.   

ఇంజనీరింగ్ విద్యార్థులేంటి? టీ వ్యాపారమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? ఈ టీ వ్యాపారాన్ని అంత తేలిగ్గా తీసిపారేయడానికి లేదండోయ్. ఎందుకంటే ఈ టీ ఇప్పుడు వారికి మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. బాగల్ కోటేకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కల్చర్ లో టీ అమ్మకందారులుగా మారిపోయారు. అమీర్ సోహైల్, మహ్మద్ యాసీన్ అనే ముస్లిం యువకులు టీ వ్యాపారంలో మంచి విజయం సాధించారు. 

ఈ ఇద్దరూ డిప్లొమాలు పూర్తి చేసి బెంగళూరు, పుణెలో ఉద్యోగాల కోసం ఎంతో కష్టపడ్డారు. అయితే వీరు ప్రధాని మోదీ ప్రయాణం స్ఫూర్తితో సొంతంగా టీ వ్యాపారం ప్రారంభించాలనుకున్నారట. ప్రస్తుతం ఈ యువకులు బాగల్ కోట్ లోని వల్లభ్ భాయ్ సర్కిల్ లో టేస్టీ టేస్టీ మలై టీ ని తయారు చేసే పనిలో పడ్డారు. వీరి దుఖానికి  "ఇంజనీర్ బంగాయా చాయ్ వాలా"  అనే పేరు కూడా పెట్టారు. ఇది నగరంలోని టీ ప్రియులందరినీ తనవైపు తిప్పుకుంది. వీళ్లు తయారుచేసే టీని జనాలు ఇష్టంగా తాగుతారు.

అయితే ఈ ఇద్దరు ముస్లీం సోదరులు టీ దుకాణం నడపడానికి ఒక కారణం ఉంది. వీళ్ల డిప్లొమా తర్వాత ఉద్యోగాల కోసం ఎంతో వెతికారు. ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. జాబ్స్ రాలే. అయినా నిరాశ చెందకుండా సొంతంగా ఏదైనా చేయాలనుకున్నారు. ఇంకేముందు నష్టం లేకుండా నడిచే టీ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఎప్పుడూ ప్రజలతో సందడిగా ఉండే టీ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఈ ఇద్దరు మలై టీని ఎంతో టేస్టీగా తయారుచేస్తారు. ఈ టీని ఎవ్వరైనా ఇష్టపడతారు. 

దేశ ప్రధానికి చాయ్ వాలాగా తనదైన కథ ద్వారా యువతను జాగృతం చేసిన ప్రధాని మోదీ టీ దుకాణం తెరవాలనే ఆలోచన వారికి వచ్చింది. 2019లో 'ఇంజినీర్ బంగాయా చాయ్ వాలా' పేరుతో టీ దుకాణాన్ని ప్రారంభించి బాగల్కోట్ నగరంలో విజయవంతంగా నడుపుతున్నారు.

వీరు పూణేలో  ప్రత్యేకమైన టీని తయారు చేస్తారు. వీరు తమ టీని కప్పుకు రూ.10లకు అమ్ముతారు. వీరి టీ తాగిన వారెవ్వరైనా మళ్లీ వీరిదగ్గరకే వచ్చేంత టేస్టీగా ఉంటుంది. అందుకే వీరి దుకాణానికి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందట. మొదట్లో రోజుకు రూ.1,500 నుంచి రూ.2,000 వరకు సంపాదించినా ఇప్పుడు రోజుకు భారీ మొత్తంలో ఆదాయాన్ని సంపాదిస్తున్నారట. బాగల్ కోట్ లో ఎవరికైనా టీ తాగాలనిపిస్తే  'ఇంజినీర్ బంగాయా చాయ్ వాలా' షాపు వైపు దగ్గరికే వెళతారట. 

బాగల్ కోట్ సిటీ అంతటా ఫ్రాంచైజీగా తమ టీ షాప్ ను విస్తరించాలని  ఈ ఇద్దరు యువకలు అనుకుంటున్నారు. ఇప్పటికే నవనగర, విద్యాగిరి, కలద్గిలో దుకాణాలు తెరిచి కస్టమర్లకు సేవలందిస్తున్నారు. ఈ షాప్ కూడా అన్ని చోట్లా ఇంజనీర్ థీమ్ తో ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఆ దుకాణానికి సంబంధించి వారికి ప్రత్యేక అవసరాలు ఉంటాయి. అలాగే వారు దానిని టీ అమ్మకందారులుగా మారిన ఇంజనీర్ గా చూపించాలనుకున్నారు. డబ్బు, కార్పొరేట్ జీవితం వెనుక పరుగులు తీస్తున్న ప్రస్తుత యువతరానికి ఈ యువకులు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu