Presidential Election Result 2022 రెండో రౌండ్‌లో ద్రౌపదికి ఆధిక్యం: ముర్ముకు 1349, యశ్వంత్ సిన్హాకు 537 ఓట్లు

Published : Jul 21, 2022, 05:59 PM ISTUpdated : Jul 21, 2022, 06:04 PM IST
Presidential Election Result 2022 రెండో రౌండ్‌లో ద్రౌపదికి ఆధిక్యం: ముర్ముకు 1349, యశ్వంత్ సిన్హాకు 537 ఓట్లు

సారాంశం

రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు సాగుతుంది. రెండో రౌండ్ లో కూడా ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఆధిక్యం కొనసాగుతుంది. మొదటి రౌండ్ లో కూడా ద్రౌపది ముర్ము  ఆధిక్యంలో కొనసాగుతుంది. 

న్యూఢిల్లీ: President పదవికి జిరిగిన ఎన్నికల్లో రెండో రౌండ్ లో కూడా ఎన్డీఏ అభ్యర్ధి Draupadi Murmu ఆధిక్యతను సాధించింది.  మొదటి రౌండ్ లో కూడా ద్రౌపది ముర్ము ఆధిక్యంలో నిలిచింది. రెండో రౌండ్ లో కూడా తన ఆధిక్యాన్ని కోనసాగించింది. అంచనాలకు మించిన మెజారిటీతో ద్రౌపది ముర్ము విజయం సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రెండో రౌండ్ తర్వాత ద్రౌపది ముర్ముకు 1349 ఓట్లు, యశ్వంత్ సిన్హాకు 537 ఓట్లు దక్కాయి. ద్రౌపది ముర్ముకు దక్కిన ఓట్ల విలువ 4,38,299.  యశ్వంత్ సిన్హా ఓటు విలువ 1,89, 876 గా నమోదైంది. రెండో రౌండ్ లో ద్రౌపది ముర్ముకు 809 ఓట్లు వచ్చాయి. యశ్వంత్ సిన్హాకు 329 ఓట్లు వచ్చాయి. ఈ రెండు రౌండ్లను కలిపితే ద్రౌపది ముర్ముకు 1349 ఓట్లు, యశ్వంత్ సిన్హాకు 537 ఓట్లు దక్కాయి.

మొదటి రౌండ్ లో  NDA  అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు 3,78,000 ఓట్లు నమోదయ్యాయి. విపక్ష పార్టీల అభ్యర్ధి  Yashwant sinhaకు 1,45,600 ఓట్లు నమోదయ్యాయి.  మొదటి రౌండ్ లో ద్రౌపది ముర్ముకు 540 ఓట్లు, యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు దక్కాయి.రాష్ట్రపతి పదవి కోసం ఈ నెల 18న ఎన్నికలు నిర్వహించారు. ఈ పోలింగ్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపును ఇవాళ ప్రారంభించారు అధికారులు. ఇవాళ ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు రాత్రి 8 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం