జమ్మూ కశ్మీర్ లో ఎన్ కౌంటర్... ఇద్దరు ఉగ్రవాదులు హతం

Published : May 22, 2019, 09:33 AM IST
జమ్మూ కశ్మీర్ లో ఎన్ కౌంటర్... ఇద్దరు ఉగ్రవాదులు హతం

సారాంశం

జమ్మూ కశ్మీర్ లోని కుల్ గామ్ జిల్లాలో భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ‘హిజ్బుల్‌ ముజాహిదీన్(హెచ్‌ఎమ్‌)‌’కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు బుధవారం ఉదయం హతమైనట్లు పోలీసులు తెలిపారు.

జమ్మూ కశ్మీర్ లోని కుల్ గామ్ జిల్లాలో భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ‘హిజ్బుల్‌ ముజాహిదీన్(హెచ్‌ఎమ్‌)‌’కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు బుధవారం ఉదయం హతమైనట్లు పోలీసులు తెలిపారు. గోపాల్‌పొర ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన సమాచారం అందడంతో భద్రతాదళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. 

ఆ ప్రాంతంలో నిర్భంధ తనిఖీలు కొనసాగిస్తున్న సమయంలో సమీపంలోనే దాక్కొని ఉన్న ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆ ప్రాంతంలో తాత్కాలికంగా మొబైల్‌,  ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. 

PREV
click me!

Recommended Stories

LPG Cylinder Shortage : మీ కిచెన్ లో ఇవి ఉంటే చాలు.. గ్యాస్ సిలిండర్ లేకున్నా వండుకోవచ్చు
Viral Video: CBSE క్వ‌శ్చ‌న్ పేప‌ర్‌లో క్యూఆర్ కోడ్‌... స్కాన్ చేసి చూడ‌గా దిమ్మ‌తిరిగే షాక్