పదకొండేళ్ల చిన్నారి సాహసం... నీటిలో మునిగిపోతున్న అత్తను కాపాడింది.. కానీ తల్లీ, తమ్ముడు జలసమాధి..

Published : Feb 21, 2023, 11:19 AM IST
పదకొండేళ్ల చిన్నారి సాహసం... నీటిలో మునిగిపోతున్న అత్తను కాపాడింది.. కానీ తల్లీ, తమ్ముడు జలసమాధి..

సారాంశం

ఓ పదకొండేళ్ల చిన్నారి సమయస్పూర్తితో 45యేళ్ల తన అత్తను కాపాడింది. కానీ తల్లి, సోదరుడు జలసమాధి అవ్వడం ప్రత్యక్షంగా చూడాల్సి వచ్చింది. 

బెంగళూరు : దొడ్డబళ్లాపూర్‌లో ఆదివారం నాడు 11 ఏళ్ల చిన్నారి అత్యంత సాహసవంతంగా తన అత్తను కాపాడిన ఘటన వెలుగు చూసింది. సమయస్పూర్తితో స్పందించి నీటిలో మునిగిపోకుండా తన అత్తను రక్షించింది. కానీ, ఆమె తల్లి, త‌మ్ముడు జలసమాధి అవ్వడం కళ్లారా చూడాల్సి వచ్చింది. 

మృతులు దొడ్డబల్లాపూర్ పట్టణ సమీపంలోని కోలూరు గ్రామానికి చెందిన రూప (35), ఆమె కుమారుడు వి హేమంత్ (9). రూప కుమార్తె కీర్తన తన అత్త ప్రేమ (45)ను ఈ ప్రమాదంలో రక్షించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెడితే.. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో రూప, ఆమె పిల్లలు హేమంత్, కీర్తన, ఆమె కోడలు ప్రేమతో కలిసి కంది పంట కోసేందుకు తమ వ్యవసాయ భూమికి వెళ్లారు. 

పని అయ్యాక హేమంత్  పక్కనే ఉన్న చెరువు వద్దకు వెళ్లి కాళ్లు, చేతులు శుభ్రం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతను చెరువులోకి జారిపడ్డాడు. రూప, ప్రేమ, కీర్తన హేమంత్ మునిగిపోవడాన్ని గమనించారు. కుమారుడిని రక్షించేందుకు రూప చెరువులోకి దూకింది. ఆమె కూడా మునిగిపోవడం ప్రారంభించింది. దీంతో చెరువు చుట్టూ జారుడుగా ఉన్న ప్రదేశాలు గుర్తించడం కష్టమయ్యింది. 

దేశంలోని 70కి పైగా ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు.. గ్యాంగ్‌స్టర్ సిండికేట్ కేసులపై ఆరా..

ఈ క్రమంలోనే ప్రేమ.. రూపను బయటకు లాగడానికి ప్రయత్నించింది. కానీ, ఆమె కూడా నీటిలోకి లాగేయబడింది. ఈ సమయంలో కీర్తన సమయస్పూర్తితో వ్యవహరించిందని..  సమీపంలో ఉన్న డ్రిప్ ఇరిగేషన్ పైపును తీసుకొని చెరువులోకి విసిరిందని మోహన మూర్తి అనే గ్రామస్థుడు తెలిపాడు. తన అత్తను బయటకు లాగేంత బలం తనకు లేనందున ఆ చిన్నారి కీర్తన, పైపు మరో కొసను బొప్పాయి చెట్టుకు కట్టివేసింది. దీంతో పైపును పట్టుకోగలిగిన.. ప్రేమ నీళ్లలోంచి బయటికి వచ్చింది. వెంటనే గట్టిగా కేకలు వేసి గ్రామస్తులను అలర్ట్ చేసింది. 

ఆమె కేకలతో గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే రూప, ఆమె కొడుకు నీళ్లలో పూర్తిగా మునిగి కనిపించకుండా పోయారు. వెంటనే దొడ్డబల్లాపూర్ రూరల్ పోలీసులకు సమాచారం అందించారు.  వారు అంబులెన్స్‌తో అక్కడికి వచ్చారు. గాలింపు చేపట్టి, సాయంత్రం 5 గంటలకు మృతదేహాలను వెలికితీశారు. కోలూరులోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న కీర్తన తన అత్త ప్రాణాలను కాపాడడంలో అద్భుతమైన సాహసం చేసిందని మూర్తి తెలిపారు. సోదరుడు మునిగిపోవడం చూసి.. తల్లి, అత్తల లాగా తానూ చెరువులో దూకలేదు.

ఇలాంటి సంఘటనలు జరగకుండా పొలంలో ఏర్పాటు చేసుకునే ఇలాంటి నీటి వనరుల చుట్టూ కంచె వేయాలని మూర్తి తన తోటి రైతులను అభ్యర్థించారు. ఫారం పాండ్స్‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఫారం పాండ్‌లకు ఇచ్చే సబ్సిడీలో కొంత భాగాన్ని బీమా కవరేజీకి మళ్లించవచ్చని ఆయన అన్నారు.

ప్రైవేట్ ఫ్యాక్టరీ ఉద్యోగి రూప భర్త విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రూపను ఆమె కజిన్ ప్రేమనే పెంచిందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆమె ఒక ఫ్యాక్టరీలో పని చేస్తోంది. కోవిడ్ -19 తర్వాత తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి వ్యవసాయ పనులపై దృష్టి సారించింది. రూప,హేమంత్‌ల కళ్లను బెంగళూరులోని ఓ ఆస్పత్రికి దానం చేశారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?