గోరఖ్‌పూర్‌లో విషాదం.. రెచ్చిపోయిన ఏనుగు, ముగ్గురు మృతి.. 

Published : Feb 17, 2023, 01:39 AM IST
గోరఖ్‌పూర్‌లో విషాదం.. రెచ్చిపోయిన ఏనుగు, ముగ్గురు మృతి.. 

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. కలశ యాత్ర కోసం తీసుకవచ్చిన  ఓ ఏనుగు రెచ్చిపోయడంతో ముగ్గురు మృతి చెందారు. కాగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రథమ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు  . ఘటన తర్వాత ఈవెంట్ రద్దు చేయబడింది. మృతుల కుటుంబాలకు సీఎం యోగి ఒక్కొక్కరికి రూ.5 లక్షల సాయం ప్రకటించారు.

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. కలశ యాత్ర కోసం తీసుకవచ్చిన  ఓ ఏనుగు రెచ్చిపోయింది. నానా బీభత్సం స్రుష్టించింది. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కాగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రథమ చికిత్స కోసం ఆస్పత్రికి పంపించారు. ఘటన తర్వాత.. ఆ కార్యక్రమం రద్దు చేయబడింది. మృతుల కుటుంబాలకు సీఎం యోగి ఒక్కొక్కరికి రూ.5 లక్షల సాయం ప్రకటించారు. 

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌ చిలువాటల్‌ ప్రాంతంలోని జగత్‌బేలాలో ఉన్న మహ్మద్‌పూర్‌ మాఫీ గ్రామంలో ఫిబ్రవరి 16 నుంచి 24 వరకు లక్ష్మీనారాయణ మహాయజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు కలశ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. కలశ యాత్రకు నీరు తెచ్చేందుకు మహిళలు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెయ్యి మందికిపైగా ఆ యాత్రకు తరలివచ్చారు. అయితే.. ఈ కార్యక్రమం కోసం.. ప్రత్యేకంగా రెండు ఏనుగులు, రెండు ఒంటెలను కిరాయికి తీసుకొచ్చారు. 
 
ఈ క్రమంలో ఏనుగును చూసేందుకు, దానితో ఫొటోలు దిగేందుకు జనం గుమిగూడారు. ఈ క్రమంలో కొంత మంది ఆకతాయిలు ఏనుగును ఆటపట్టించడం ప్రారంభించారు. వారి ఆకతాయితనానికి ఏనుగు ఆగ్రహానికి గురై అటు ఇటు పరుగెత్తడం మొదలుపెట్టింది.  దీంతో అక్కడ తొక్కిలాసట జరిగింది. కాంతి దేవి (55), కౌశల్యా దేవి (50) అనే ఇద్దరు మహిళలను నేలమీద పడేసి.. ఏనుగు కాళ్లతో తొక్కింది. తర్వాత పొలం వైపు పరుగెత్తింది. ఈ సమయంలో కౌసల్యా దేవి మనవడు కృష్ణ (4) కూడా ఆమె ఒడిలో ఉన్నాడు. కౌశల్య ఏనుగును పూజించడానికి అనారోగ్యంతో ఉన్న తన మనవడిని తన ఒడిలోకి తీసుకుంది, కానీ ఏనుగు కౌసల్యతో పాటు అమాయకుడైన చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.  

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు మధ్యాహ్నం 2 గంటల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తొలుత మహౌట్ .. ఏనుగును అదుపు చేసేందుకు ప్రయత్నించినా అదుపు చేయలేకపోయాడు. అనంతరం ఏనుగును అదుపు చేసేందుకు అటవీ శాఖ బృందం ట్రాంక్విలైజర్‌ గన్‌తో షాట్‌ ఇచ్చింది. కొంతసేపటికి ఏనుగు ప్రశాంతంగా ఉండి నేలపై కూర్చుంది. సాయంత్రం 6.30 గంటల ప్రాంతం లో ఏనుగును అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం