40 ఏళ్ల తర్వాత ఆ 40 గ్రామాల్లో మళ్లీ పోలింగ్.. మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో మార్పు

By Mahesh K  |  First Published Oct 14, 2023, 2:50 PM IST

ఈ సారి ఛత్తీస్‌గడ్ అసెంబ్లీ ఎన్నికలు బస్తర్ జిల్లాలోని 40 గ్రామాలకు ఒక ప్రత్యేకతను వెంట తెస్తున్నది. ఈ 40 గ్రామాల్లో గత 40 ఏళ్ల నుంచి మావోయిస్టుల సమస్య మూలంగా ఎన్నికలు జరగడం లేదు. ఇప్పుడు ఈ గ్రామాల్లో మళ్లీ పోలింగ్ నిర్వహిస్తున్నారు.
 


బస్తర్: మావోయిస్టు ప్రభావిత ఛత్తీస్‌గడ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. ఈ నెల 7వ తేదీన బస్తర్ జిల్లాలోని ప్రమాదకరమైన 40 గ్రామాల్లోనూ ఓటింగ్ నిర్వహణకు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ 40 గ్రామాల్లో గత 40 ఏళ్లుగా పోలింగ్ జరగడం లేదు. మావోయిస్టు సమస్య వల్ల ఇక్కడ పోలింగ్ బూత్‌లు మూసేశారు. లేదా వేరే గ్రామాలకు తరలించారు. అయితే, ఈ సారి అసెంబ్లీ ఎన్నికలు ఈ గ్రామాలకు ప్రత్యేకంగా మారాయి. ఈ గ్రామాల్లోనూ పోలింగ్ నిర్వహిస్తున్నారు.

40 ఏళ్ల తర్వాత మావోయిస్టు ప్రభావం ఎక్కువగా ఉండే 40 గ్రామాలలో మళ్లీ 120 పోలింగ్ స్టేషన్లను శనివారం ఓపెన్ చేస్తున్నారు. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టు పార్టీ పిలుపు ఇచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ ఇక్కడ మరింత జాగరూకతతో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. గత ఐదేళ్లలో ఇక్కడ 60కిపైగా సెక్యూరిటీ క్యాంపులను నెలకొల్పారు. ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి ఈ క్యాంపులు ఏర్పాటు చేశారు.

Latest Videos

Also Read: Global Hunger Index 2023: ప్రపంచ ఆకలి సూచీలో మరింత దిగజారిన భారత్.. స్థానమెంత?

ఇప్పుడు ఈ ఏరియాల్లో ఎన్నికలు నిర్వహించడం సురక్షితమే అని పోలీసులు చెబుతున్నారు. ఎన్నికలు నిర్వహించడానికి ఇక్కడ శిక్షణలు కూడా జరుగుతున్నాయి. బస్తర్ డివిజన్ ఐజీపీ సుందర్ రాజ్ పీ మాట్లాడుతూ, ఇక్కడ పద్ధతిగా ఎన్నికలు నిర్వహణ జరగడానికి బలగాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని వివరించారు. అన్ని రకాల భద్రతాపరమైన, పాలనాపరమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఒక పద్ధతి ప్రకారం ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సిన కసరత్తు మొత్తం చేస్తున్నామని వివరించారు.
 

click me!