UP Election 2022 : యోగికి ఓటేయకుంటే బుల్డోజర్లతో తొక్కిపడేస్తాం... రాజాసింగ్ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్

Siva Kodati |  
Published : Feb 16, 2022, 05:13 PM IST
UP Election 2022 : యోగికి ఓటేయకుంటే బుల్డోజర్లతో తొక్కిపడేస్తాం... రాజాసింగ్ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్

సారాంశం

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (up election 2022) యోగి ఆదిత్యనాథ్‌కు ఓటేయకపోతే బుల్డోజర్‌లతో తొక్కిస్తామంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన (raja singh) వ్యాఖ్యలు దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్నికల సంఘం.. రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేసింది. 

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (up election 2022) యోగి ఆదిత్యనాథ్‌కు ఓటేయకపోతే బుల్డోజర్‌లతో తొక్కిస్తామంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన (raja singh) వ్యాఖ్యలు దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విషయం ఎన్నికల సంఘం (election commission) వరకు వెళ్లడంతో.. ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని కోరింది. 

కాగా.. యూపీ ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చిన రాజాసింగ్... యోగి ఆదిత్యనాథ్ కు (yogi adityanath) ఓటు వేయకుంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు రాజాసింగ్ మంగళవారం వీడియో విడుదల చేశారు. మంగళవారం జరిగిన రెండో విడత పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల అత్యధిక పోలింగ్ జరిగింది అని పేర్కొంటూ... యోగిని వ్యతిరేకిస్తున్న వారే ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేసి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. మూడో దశ పోలింగ్ లో హిందువులంతా బయటకు రావాలని పిలుపునిచ్చారు.

రాజా సింగ్ ను తక్షణం అరెస్టు చేయాలి…
యూపీలో ఓటర్లను బెదిరిస్తూ రాజాసింగ్ బాహాటంగా వ్యాఖ్యలు చేశారని, అందుకు ఆయనను తక్షణం అరెస్టు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ రాజాసింగ్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని.. ఈసీ స్పందించాలని విజ్ఞప్తి చేశారు. 

ఇదిలా ఉండగా, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(AIMIM)  చీఫ్ Asaduddin Owaisi శ్రీరాముని వంశస్థుడని BJP MP బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు. ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా సింగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు జాతీయ మీడియా తెలిపింది.  ఆయన కుమారుడు ప్రతీక్ భూషణ్ సింగ్  బీజేపీ అభ్యర్థిగా గోండా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

బ్రిజ్ భూషణ్ kaiserganj నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన కుమారుడు ప్రతీక్ విజయం కోసం ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓవైసీ తనకు Old friend అని చెప్పారు.తనకు తెలిసినంత వరకు ఆయన క్షత్రియుడు అని తెలిపారు. ఆయన Sri Rama వంశస్థుడు అని ఇరాన్ కు చెందిన వాడు కాదని చెప్పారు. ఓవైసీ పార్టీతో సమాజ్వాది పార్టీ పొత్తు కుదుర్చుకోనందుకు మండిపడ్డారు. Muslimsపై నాయకత్వం కోసం Akhilesh Yadav, ఓవైసీ పోట్లాడుకుంటున్నారు అన్నారు.

ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మోసగాడు అన్నారు. ఆయన తన తండ్రిని, తన అంకుల్ని మోసం చేశాడు అన్నారు. మోసం చేయడమే ఆయన పని అని దుయ్యబట్టారు. బీజేపీకి రాజీనామా చేసి ఎస్ పీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్యాని కూడా మోసం చేశారని ఆరోపించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !