ఉద్ధవ్- షిండే వర్గాలకు షాక్ .. శివసేన ‘విల్లు బాణం’ గుర్తును ఫ్రీజ్ చేసిన ఈసీ

Siva Kodati |  
Published : Oct 08, 2022, 09:55 PM ISTUpdated : Oct 08, 2022, 10:11 PM IST
ఉద్ధవ్- షిండే వర్గాలకు షాక్ .. శివసేన ‘విల్లు బాణం’ గుర్తును ఫ్రీజ్ చేసిన ఈసీ

సారాంశం

శివసేన గుర్తు అయిన ‘‘విల్లు - బాణం’’ను ఫ్రీజ్ చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఉపఎన్నికల కోసం ఎల్లుండిలోగా మరో గుర్తును ఎంపిక చేసుకోవాలని ఉద్ధవ్, షిండే వర్గాలకు సూచించింది. 

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ షిండేలకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. శివసేన గుర్తు అయిన ‘‘విల్లు - బాణం’’ను ఫ్రీజ్ చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఉపఎన్నికల కోసం ఎల్లుండిలోగా మరో గుర్తును ఎంపిక చేసుకోవాలని ఉద్ధవ్, షిండే వర్గాలకు సూచించింది. ముంబైలోని ఈస్ట్ అంధేరి నియోజకవర్గానికి సంబంధించిన ఉపఎన్నిక పోలింగ్ నవంబర్ 3న జరగనున్న సంగతి తెలిసిందే.

కాగా.. మహారాష్ట్రలో తిరుగుబాటుకు నేతృత్వం వహించిన ఏక్‌నాథ్ షిండే అనంతరం జరిగిన పరిణామాల మధ్య బీజేపీ మద్ధతుతో సీఎం పీఠం అధిరోహించిన సంగతి తెలిసిందే. అనంతరం తమదే అసలైన శివసేన అని.. మెజారిటీ నేతలు తనతో పాటే వున్నారని షిండే ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అందువల్ల శివసేన ఆస్తులు, ఎన్నికల గుర్తు అయిన విల్లు బాణం తమకే కేటాయించాలని ఆయన కోరారు. ఈ క్రమంలో పార్టీ రెండు వర్గాలు చీలిపోయింది. దీంతో ఉద్ధవ్ ఠాక్రే, షిండే వర్గాలు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాయి. 

Also REad:శివ‌సేనకు మ‌రో ఎదురుదెబ్బ‌.. భారీ ఎత్తున ఏక్ నాథ్ షిండే వ‌ర్గంలో చేరిన ముంబై కార్య‌క‌ర్త‌లు

సుప్రీంకోర్టులో ఉద్ధవ్ థాక్రేకు షాక్ తగిలిన సంగతి తెలిసిందే. అసలైన శివసేనను గుర్తించే అధికారం ఈసీకి ఉందని ధర్మాసనం తేల్చింది. సుప్రీం ఆదేశాల మేరకు పార్టీ గుర్తు ఎవరికి చెందాలన్న దానిపై ఎన్నికల సంఘం ప్రాసెస్ మొదలెట్టింది. దీనిలో భాగంగా పార్టీ గుర్తు కేటాయింపుపై అభిప్రాయం చెప్పమని ఉద్ధవ్‌ను కోరింది ఈసీ. దీనిపై గడువు కంటే ముందుగానే స్పందించిన ఈయన.. షిండే, ఆయన వర్గీయులు పార్టీ నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోయారని.. అందువల్ల వారికి పార్టీ పేరు, గుర్తు అడిగే హక్కు లేదని తేల్చిచెప్పారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు